IND vs ENG: ‘నీ కంటే కుల్‌దీప్‌ నయం’.. టీమిండియా యంగ్ బ్యాటర్‌ను ఏకిపారేస్తోన్ననెటిజన్లు

రాంచీ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు 152 పరుగులు చేస్తే మ్యాచ్ తో పాటు ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ రోహిత్ సేన కైవసం చేసుకుంటుంది. అయితే ఈ పిచ్ పై బ్యాటింగ్ అంత సులభమేమీ కాదంటున్నారు. టీమిండియా బ్యాటర్లు జాగ్రత్తగా ఆడకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

IND vs ENG: 'నీ కంటే కుల్‌దీప్‌ నయం'.. టీమిండియా యంగ్ బ్యాటర్‌ను ఏకిపారేస్తోన్ననెటిజన్లు
Team India
Follow us

|

Updated on: Feb 25, 2024 | 8:13 PM

రాంచీ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు 152 పరుగులు చేస్తే మ్యాచ్ తో పాటు ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ రోహిత్ సేన కైవసం చేసుకుంటుంది. అయితే ఈ పిచ్ పై బ్యాటింగ్ అంత సులభమేమీ కాదంటున్నారు. టీమిండియా బ్యాటర్లు జాగ్రత్తగా ఆడకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని క్రికెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత జట్టు యువ బ్యాటర్ రజత్ పాటిదార్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఎందరో సీనియర్లను పక్కన పెట్టి పటిదార్ ను జట్టులోకి చేర్చుకున్నారు. అనుభవజ్ఞులు అందుబాటులో లేకపోవడంతో టీమిండియాలో ఆడే అవకాశం దక్కించుకున్న రజత్ పాటిదార్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంకా ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. గత రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించడంతో రజత్ ఫ్లాప్ షో పెద్దగా చర్చనీయాంశం కాలేదు. నాలుగో టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమ్ ఇండియా ఇన్నింగ్స్ కష్టాల్లో పడ్డప్పుడు కూడా రజత్ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకోలేదు. ఈ మ్యాచ్ లో రజత్ పాటిదార్ బ్యాటింగ్ చూసిన టీమ్ ఇండియా అభిమానులు అతని కంటే కుల్దీప్ యాదవ్ బాగా బ్యాటింగ్ చేస్తాడని ట్రోల్ చేస్తున్నారు. క్కించుకున్న రజత్ పాటిదార్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇంకా ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు.

రాంచీ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రజత్ 42 బంతులు ఎదుర్కొని కేవలం 17 పరుగులకే ఔటయ్యాడు. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో ఔటైన రజత్ మరోసారి పేలవ బ్యాటింగ్ తో అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యాడు. ఆ తర్వాత అభిమానులు రజత్ పటీదార్ గురించి సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. రజత్ పాటిదార్‌ను జట్టు నుంచి తప్పించాలని కొందరు అభిమానులు డిమాండ్ చేశారు. రజత్ పాటిదార్‌కు రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆ మ్యాచ్ లో వరుసగా 9, 32 పరుగులు మాత్రమే. మూడో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 5 పరుగులు చేశాడు. ఇందులో ఒక డకౌట్ కూడా ఉంది.ఇప్పుడు కేవలం 17 పరుగులు మాత్రమే చేసిన రజత్ పటీదార్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.