IND vs AUS 1st Test: భారత్, అస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటయింది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ జట్టు 177 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక టీమిండియా తరఫున ఓపెనర్‌గా దిగిన రోహిత్ శర్మ(212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేయగా.. మధ్యలో వచ్చిన రవీంద్ర జడేజా(185 బంతుల్లో 70; 9 ఫోర్లు), తొమ్మిదో స్థానంలో వచ్చిన ఆక్సర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు; 1 సిక్స్) ఆసీస్ బౌలర్లకు టెస్ట్ మ్యాచ్‌లో కూడా చెమటలు పట్టింటారు.
అలాగే వీరితో పాటు చివర్లో వచ్చిన మొహమ్మద్ షమి (47 బంతుల్లో 37; 2 ఫోర్లు; 3 సిక్సర్లు) కూడా పర్వాలేదనిపించాడు. ఈ నలగురు మినహా మిగిలినవారంతా పేలవ ప్రదర్శనను కనబర్చారు. అయితే ఆసీస్ బౌలర్లలో ఆరంగేట్ర ఆటగాడు 7 వికెట్లతో చెలరేగాడు. తనతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 2 వికెట్లు, నాథన్ లియన్ 1 వికెట్ తీసుకున్నారు. అంతకముందు ఆసీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాపై భారత్ 223 పరుగుల లీడ్‌ను సాధించినట్లయింది.
Lunch on Day 3 of the 1st Test.#TeamIndia all out for 400. Lead by 223 runs.
Rohit Sharma (120)
Axar Patel (84)
Ravindra Jadeja (70)Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/iUvZhUrGL1
— BCCI (@BCCI) February 11, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..