
India vs Afghanistan Test Squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే జూన్ 2026 నెలలో అఫ్గానిస్తాన్‌తో స్వదేశీ సిరీస్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ముగిసిన ఉత్సాహంలో ఉన్న ఆటగాళ్లు వెంటనే జాతీయ జట్టు తరఫున మైదానంలోకి దిగనున్నారు. జూన్ 6 నుంచి 10 వరకు కొత్త చండీగఢ్‌లోని ముల్లాంపూర్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం, జూన్ 14 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, మధ్య వరుసలో దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్ వంటి ప్రతిభావంతులు జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనున్నాడు. పేస్ విభాగంలో మొహమ్మద్ సిరాజ్ నాయకత్వంలో ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్, ఆకాష్ దీప్ వంటి బౌలర్లు తమ సత్తా చాటనున్నారు.
వన్డే సిరీస్‌లో భారత్ మరింత పటిష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టులోకి రానుండటంతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా మారింది. గిల్, రోహిత్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనుండగా, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మధ్య ఓవర్లలో వికెట్లు పడకుండా శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బాధ్యత తీసుకోనున్నారు.
ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా రాక జట్టుకు భారీ ఊరటనిస్తుంది. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ప్రత్యర్థిని కట్టడి చేసే బాధ్యతను మోయనున్నారు.
ఏకైక టెస్ట్: జూన్ 6 – 10 (ముల్లాంపూర్, చండీగఢ్)
మొదటి వన్డే: జూన్ 14 (ధర్మశాల)
రెండవ వన్డే: జూన్ 17 (లక్నో)
మూడవ వన్డే: జూన్ 20 (చెన్నై)
టెస్టు జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్, సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..