AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 Wolrd Cup 2026: రేపు సౌతాఫ్రికాతో తలపడనున్న హర్మన్ సేన! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ సెమీస్ ఆశలకు కీలకం. అజేయంగా ఉన్న టీమిండియా సౌతాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ ప్రధాన ఆకర్షణ. దీప్తి శర్మ, శ్రీ చరణి స్పిన్ బౌలింగ్ భారత్‌కు కలిసొచ్చే అంశం. హెడ్-టు-హెడ్ రికార్డులు ఉత్కంఠను పెంచుతున్నాయి.

Women's T20 Wolrd Cup 2026: రేపు సౌతాఫ్రికాతో తలపడనున్న హర్మన్ సేన! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే..?
Ind W Vs Sa W
SN Pasha
|

Updated on: Jun 20, 2026 | 4:33 PM

Share

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా టీమిండియా ఆదివారం కీలక పోరుకు సిద్ధమవుతోంది. గ్రూప్-1లో పటిష్టమైన సౌతాఫ్రికాతో హర్మన్ సేన తలపడనుంది. ఆదివారం ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా, రెండింటిలోనూ గెలిచి అజేయంగా ఉంది. మరోవైపు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాపై ఓడి, పాకిస్థాన్‌పై గెలిచి వస్తోంది. టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత బలపడాలంటే ఆదివారం సౌతాఫ్రికాను కచ్చితంగా ఓడించి తీరాల్సింది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్‌పై ఉంటుంది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ వరుస హాఫ్ సెంచరీలు సాధించిన మంధాన మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు వోల్వార్డ్ కూడా పెద్ద మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించే సామర్థ్యాన్ని ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టుకు వెన్నుముకగా మారుతుంది. అయితే టీమిండియాకు ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే.. స్పిన్ బౌలింగ్. దీప్తి శర్మ పాకిస్థాన్‌పై ఐదు వికెట్లు పడగొట్టి అదరగొట్టిన విషయం తెలిసిందే. అలాగే శ్రీ చరణి నెదర్లాండ్స్‌పై నాలుగు వికెట్లతో ఆకట్టుకుంది. ఈ స్పిన్ దాడిని ఎదుర్కోవడం దక్షిణాఫ్రికాకు పెద్ద సవాలుగా మారనుంది.

హెడ్ టూ హెడ్ రికార్డ్స్..

ఇరు జట్ల మధ్య టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు జరిగిన 24 మ్యాచ్‌లలో భారత్ 11 విజయాలు, దక్షిణాఫ్రికా 10 విజయాలు నమోదు చేశాయి. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే ఇటీవల జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 4-1 తేడాతో భారత్‌పై ఆధిపత్యం చెలాయించడం ఆసక్తికర అంశం. పైగా వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికా గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంటే, దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ప్రొటీస్ జట్టు రంగంలోకి దూకుతోంది. కాగా భారత అభిమానులు ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు. టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, వాటి హెచ్‌డీ ఛానెళ్లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us