USA vs IND: ఇదేందయ్యా ఇది.. అమెరికా టీం చూసి షాక్ అవ్వాల్సిందే.. ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే

United States of America U19 vs India U19: ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు మొదటి మ్యాచ్‌లో USAతో తలపడింది. ఈ మ్యాచ్‌లో, భారత సంతతికి చెందిన 11 మంది ఆటగాళ్ళు టీమ్ ఇండియాతో తలపడి అందరినీ ఆశ్చర్యపరిచారు.

USA vs IND: ఇదేందయ్యా ఇది.. అమెరికా టీం చూసి షాక్ అవ్వాల్సిందే.. ప్లేయింగ్ 11లో అంతా మనోళ్లే
U19 Vs India U19

Updated on: Jan 15, 2026 | 8:38 PM

United States of America U19 vs India U19: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2026 వేదికగా ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. జింబాబ్వేలోని బులవాయోలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్, అమెరికా జట్లు తలపడ్డాయి. అయితే, మైదానంలోకి దిగిన అమెరికా జట్టును చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే, ఆ జట్టులోని 11 మంది ఆటగాళ్లు కూడా భారత సంతతికి చెందినవారే కావడమే దీనికి కారణం.

అమెరికా జట్టు.. అంతా ‘భారతీయమే’!

సాధారణంగా ఇతర దేశాల జట్లలో ఒకరిద్దరు భారత సంతతి ఆటగాళ్లు ఉండటం మనం చూస్తుంటాం. కానీ, ఒక అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ప్రత్యర్థి జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు భారతీయ మూలాలు ఉన్నవారు కావడం ఇదే మొదటిసారి. కేవలం ప్లేయింగ్ ఎలెవనే కాదు, అమెరికా ఎంపిక చేసిన 15 మంది సభ్యుల స్క్వాడ్ మొత్తం భారత సంతతికి చెందిన యువకులతోనే నిండిపోయింది.

ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నది వీరే: భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అమెరికా తరఫున బరిలోకి దిగిన ఆటగాళ్ల పేర్లు ఇక్కడ ఉన్నాయి:

ఇవి కూడా చదవండి

ఉత్కర్ష్ శ్రీవాస్తవ (కెప్టెన్)

అద్రిత్ ఝాంబ్

నితీష్ సుదిని

అర్జున్ మహేష్

అమరీందర్ గిల్

సబరీష్ ప్రసాద్

ఆదిత్ కప్పా

సాహిల్ గార్గ్

అమోఘ్ రెడ్డి ఆరెపల్లి

రిత్విక్ అప్పిడి

రిషబ్ షింపి

వీరితో పాటు రిజర్వ్ బెంచ్‌పై ఉన్న అద్వైత్ కృష్ణ, రేయాన్ తాజ్, సాహిర్ భాటియా, శివ శని కూడా భారత మూలాలు ఉన్నవారే.

కెప్టెన్ పుణే వాసి..

అమెరికా జట్టుకు సారథ్యం వహిస్తున్న ఉత్కర్ష్ శ్రీవాస్తవ మహారాష్ట్రలోని పుణేలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్ళింది. కేవలం ఉత్కర్ష్ మాత్రమే కాదు, ఈ జట్టులోని మెజారిటీ ఆటగాళ్ల తల్లిదండ్రులు హైదరాబాద్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడినవారే.

మ్యాచ్ విషయానికి వస్తే..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ ఆయుష్ మ్హత్రే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అమెరికా జట్టులో నితీష్ సుదిని 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, భారత బౌలర్ల ధాటికి అమెరికా 107 పరుగులకే కుప్పకూలింది. భారత ఫాస్ట్ బౌలర్ హెనిల్ పటేల్ 5 వికెట్లతో అమెరికా వెన్నువిరిచాడు. లక్ష్య ఛేదనలో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.

క్రికెట్ ఇప్పుడు కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో భారతీయ సంతతి ప్రజలు క్రికెట్‌ను బ్రతికిస్తున్న తీరు అభినందనీయం. ఈ 2026 అండర్-19 వరల్డ్ కప్ ద్వారా అమెరికా జట్టులో ప్రతిభావంతులైన భారత సంతతి యువకులు తమ సత్తా చాటుకునే అవకాశం లభించింది. భవిష్యత్తులో వీరు అంతర్జాతీయ క్రికెట్‌లో కీలక ఆటగాళ్లుగా ఎదిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..