AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఓవర్ యాక్షన్‌తో దూలతీర్చిన ఐసీసీ.. పాకిస్థాన్ కెప్టెన్‌కు భారీ జరిమానాతోపాటు..!

India vs Pakistan Women: భారత్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఫాతిమా సనాకు ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.

Video: ఓవర్ యాక్షన్‌తో దూలతీర్చిన ఐసీసీ.. పాకిస్థాన్ కెప్టెన్‌కు భారీ జరిమానాతోపాటు..!
Icc Fine Fatima Sana
Venkata Chari
|

Updated on: Sep 07, 2026 | 4:58 PM

Share

ICC fine Fatima Sana: భారత్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో అనుచితంగా ప్రవర్తించిన పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక చర్యలు తీసుకుంది. మ్యాచ్ సందర్భంగా ఆమె ప్రవర్తనను నిబంధనలకు విరుద్ధంగా పరిగణించిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.

ఏమి జరిగిందంటే?

భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో ఫాతిమా సనా చేసిన ఓ సంజ్ఞ వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఆమె ప్రవర్తనను పరిశీలించిన అనంతరం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆటగాళ్లు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ నిర్ణయించింది. దీంతో శిక్ష విధించింది.

డీమెరిట్ పాయింట్ కూడా..

జరిమానాతో పాటు ఫాతిమా సనా ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనలకు ఆటగాళ్లకు డీమెరిట్ పాయింట్లు కేటాయించే విధానంలో భాగంగా ఈ చర్య తీసుకుంది. దీంతో పాక్ కెప్టెన్‌కు జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ చేరింది.

భారత్–పాక్ పోరుకు మరో మలుపు..

మహిళల ఆసియా కప్‌లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందే ఇరు జట్ల మధ్య ప్రోటోకాల్ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఫాతిమా సనాపై ఐసీసీ ఫనిష్మెంట్ (ICC punishment) రావడంతో ఈ మ్యాచ్‌కు సంబంధించిన పరిణామాల్లో మరో అంశం చేరింది. ఆటగాళ్ల ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ సంస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ చర్య స్పష్టం చేసింది.

ఫాతిమా సనా పాకిస్థాన్ మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఐసీసీ నిర్ణయం ఇప్పుడు ఉమెన్స్ ఆసియా కప్ (Women’s Asia Cup 2026)లో మరో ముఖ్య వార్తగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us