
AUS vs PAK, ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023) లో ఆస్ట్రేలియాతో పోటీ పడేందుకు బెంగళూరు చేరుకున్న పాకిస్థాన్ జట్టు (Australia vs Pakistan) కష్టాల్లో పడింది. భారత్‌పై ఓటమి తర్వాత పాక్ ఆటగాళ్లు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లలో వైరల్ ఫీవర్ సోకింది. ఇందులో చాలా మంది ఆటగాళ్ల ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడింది. అయితే మరో ఇద్దరు ఆటగాళ్ల ఆరోగ్యం కోలుకోలేదని సమాచారం.
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు బెంగళూరులో ఉంది. అక్టోబర్ 20న ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జట్టు ఆడనుంది. మీడియా నివేదికల ప్రకారం, వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చాలా మంది పాకిస్తాన్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. అయితే, జట్టులో ఎక్కువ మంది ప్రభావితం కాలేదు. కేవలం ఇద్దరు ఆటగాళ్ళు ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఇప్పటికీ ఫ్లూతో బాధపడుతున్నారు.
నిన్న సాయంత్రం, పాకిస్తాన్ జట్టు బెంగళూరులోని తమ హోటల్ నుంచి టీమ్ డిన్నర్ కోసం బయలుదేరింది. అక్టోబర్ 17 న ఎం. చిన్నస్వామి స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ చేయడానికి షెడ్యూల్ చేశారు. కానీ, ఆటగాళ్ల అస్వస్థత కారణంగా ప్రాక్టీస్ సెషన్‌ను గంటపాటు కుదించారు.
గత కొన్ని రోజులుగా మా జట్టులోని కొందరు ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతున్నారని, ఆటగాళ్ల అనారోగ్యం గురించి పాకిస్థాన్ మీడియా మేనేజర్ అహ్సన్ నాగి తెలియజేశారు. ఇప్పటి వరకు చాలా మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంకా కోలుకుంటున్న వారు టీమ్ మెడికల్ కమిటీ పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
పాకిస్థాన్ తమ ప్రపంచ కప్ ప్రచారాన్ని హైదరాబాద్‌లో బలంగా ప్రారంభించింది. నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంకతో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. అయితే అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. ఆటగాళ్లు అస్వస్థతకు గురై స్వల్ప ఎదురుదెబ్బ తగిలిన పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లోపు ఆటగాళ్లంతా కోలుకుని ఫిట్ గా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..