వర్షం.. వరల్డ్‌కప్.. ఫ్యాన్స్ వర్రీ.. వర్రీ!

|

Jun 12, 2019 | 3:19 PM

ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అయితే ఈసారి జరుగుతున్న వరల్డ్‌కప్ అభిమానులను నిరాశకు గురి చేస్తోందని చెప్పాలి. ఇక ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లన్ని ఏకపక్షంగా సాగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడిప్పుడే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో వరుణుడు అనుకోని అతిథిలా వచ్చి.. మ్యాచ్‌లను రద్దు చేస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు ఆటగాళ్ల […]

వర్షం.. వరల్డ్‌కప్.. ఫ్యాన్స్ వర్రీ.. వర్రీ!
Follow us on

ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళకు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. అయితే ఈసారి జరుగుతున్న వరల్డ్‌కప్ అభిమానులను నిరాశకు గురి చేస్తోందని చెప్పాలి. ఇక ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లన్ని ఏకపక్షంగా సాగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడిప్పుడే మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో వరుణుడు అనుకోని అతిథిలా వచ్చి.. మ్యాచ్‌లను రద్దు చేస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు ఆటగాళ్ల గాయాల బెడద.. మరోవైపు వరుణుడి అడ్డంకితో ఆయా జట్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే వర్షం దెబ్బకు మ్యాచ్‌లు రద్దవుతున్న నేపథ్యంలో సెమీ ఫైన‌ల్‌లో ఆడే జ‌ట్ల‌పై ఆ ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆయా జ‌ట్లు ఆందోళ‌న చెందుతున్నాయి. ఇకపోతే ఇలా మరిన్ని మ్యాచ్‌లు రద్దయితే.. ప్రపంచకప్ సమీకరణాలే మారిపోతాయని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు వర్షార్పణం…

వరల్డ్‌కప్ 2019లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. అవి బ్రిస్టల్‌లో జరగాల్సిన శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్, సౌథాంప్టన్‌లో జరగాల్సిన సౌతాఫ్రికా, విండీస్ మ్యాచ్, నిన్న జరగాల్సిన శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్. కాగా బ్రిస్ట‌ల్‌లో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లో క‌నీసం ఒక బాల్ కూడా ప‌డ‌లేదు. సౌతాంప్ట‌న్‌లో మాత్రం సఫారీలు 7.3 ఓవ‌ర్లు ఆట మాత్రమే అడగలిగారు. ఆ త‌రువాత వ‌ర్షం ప‌డ‌డంతో మ్యాచ్ ఆగిపోయింది. ఈ క్ర‌మంలో శ్రీ‌లంక‌, పాకిస్థాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ల‌పై మ్యాచ్ ల రద్దు ప్రభావం పడిందనే చెప్పాలి. ఇప్పుడు ఆయా జట్లన్నీ సెమీస్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్ని తప్పక గెలవాల్సిన పరిస్థితి.

ప్రపంచకప్‌లో మునుపెన్నడూ ఇలా జరగలేదు…

ఇప్పటివరకు జరిగిన వరల్డ్‌కప్‌లన్ని ఒకసారి చూస్తే.. వర్షం కారణంగా ఏకంగా మూడు మ్యాచ్‌లు రద్దవడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో అసలు తాము సరైన సమయంలోనే టోర్నీ నిర్వహించామా..? అనే సందేహం ఇప్పుడు ఐసీసీకి కలుగుతోంది. అయితే ఇంగ్లాండ్‌లో ఇప్పుడు వేసవి కాలం. ఎండలు ఠారెత్తిపోకుండా రివర్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇకపోతే.. ఇంగ్లండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 4 ప్ర‌పంచ‌క‌ప్‌లు జరిగాయి. 1975 వ‌రల్డ్‌క‌ప్ జూన్ 7 నుంచి జూన్ 21 వ‌ర‌కు కొనసాగితే… 1979లో జూన్ 9 నుంచి 23 వ‌ర‌కు, 1983లో జూన్ 9 నుంచి 25 వ‌రకు, 1999లో మే 14 నుంచి జూన్ 20 వ‌ర‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను నిర్వ‌హించారు. అన్నీ దాదాపుగా జూన్‌లోనే జ‌రిగాయి. ఎన్న‌డూ కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు.

మ్యాచ్‌లకు రిజర్వ్ డేస్ అసలు ఉన్నాయా…

ప్రస్తుత ప్రపంచకప్‌లో కేవలం సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచుల‌కే రిజ‌ర్వ్ డేల‌ను ఉంచారు. దీంతో ఆయా మ్యాచ్‌లు జ‌రిగే సంద‌ర్భంలో వ‌ర్షం పడితే ఆట‌ను నిలిపివేసి మ‌రుస‌టి రోజు అక్క‌డి నుంచే ఆట‌ను కొన‌సాగిస్తారు. కానీ లీగ్ ద‌శ‌లో ఉన్న మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డేలు లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌ర్షం ప‌డితే ఆటను నిర్వ‌హించే ప‌రిస్థితి లేక‌పోతే మ్యాచ్‌ను ఏకపక్షంగా ర‌ద్దు చేయాల్సి వ‌స్తోంది. అయితే లీగ్ ద‌శ‌లో అయినా స‌రే.. వ‌ర్షం ప‌డిన‌ప్పుడు మ్యాచ్‌ను మ‌రో 75 నిమిషాల స‌మ‌యం వ‌ర‌కు పొడిగించే అవ‌కాశం ఉంటుంది. కానీ తాజాగా ర‌ద్ద‌యిన మ్యాచ్‌ల‌లో వ‌ర్షాలు ఎడ‌తెరిపి లేకుండా కుర‌వ‌డంతో మ్యాచ్‌ల‌ను త‌ప్ప‌నిస‌రై ర‌ద్దు చేశారు.

మరో 3,4 రోజులు వర్షాలు కురిసే అవకాశం…

ఇంగ్లాండ్‌లో మరో 3,4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలియజేయడంతో ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ర‌ద్ద‌వుతాయోన‌ని అభిమానులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గురువారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావచ్చునని ప్రేక్షకులు భావిస్తున్నారు.