Hasan Mehmud Revealed Chennai Test 2nd Day Plan: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. గురువారం నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో నజ్ముల్ హుస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలిరోజు తొలి సెషన్ బంగ్లాదేశ్ ఆధిక్యం చూపగా.. ఆ తర్వాత, టీమ్ ఇండియా అద్భుతంగా పునరాగమనం చేసింది. రోజు ఆట ముగిసే సమయానికి 339/6 స్కోర్ చేసింది. నేడు రెండో రోజు ఆట మొదలైంది. అయితే, జడేజా సెంచరీ చేయకుండానే 86 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం అశ్విన్, అకాష్ దీప్ క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టు ప్రత్యేక వ్యూహంతో వస్తుందని హసన్ మహమూద్ వెల్లడించారు .
తొలిరోజు బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలను హసన్ మహమూద్ తీశాడు. ఈ బౌలర్ ఇప్పటికీ తమ జట్టు ఆతిథ్య జట్టును 400 కంటే తక్కువ స్కోరుకు ఆలౌట్ చేయగలమని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో మహమూద్ మాట్లాడుతూ, ‘టీమ్ ఇండియాను 400 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేస్తే అది మాకు మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను. వికెట్ ఇప్పుడు బ్యాటింగ్‌కు చాలా బాగుంది. టీమ్ ఇండియాపై ఎలా ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాం. దీన్ని చేయడంలో మేం విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
దీనితో పాటు, చివరి సెషన్‌లో బంగ్లాదేశ్ బౌలర్ల లైన్ లెంగ్త్ కాస్త క్షీణించిందని, దాని వల్ల భారత జట్టుకు ప్రయోజనం లభించిందని మహమూద్ అంగీకరించాడు. తమ జట్టుకు పునరాగమనం చేసే సత్తా ఉందని, రెండో రోజు త్వరగా వికెట్లు తీస్తే భారత్‌పై ఒత్తిడి పెరుగుతుందని హసన్ అన్నాడు.
Ravindra Jadeja departs after a fantastic knock of 86 runs.#TeamIndia 343/7
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/D4yUQaBPRe
— BCCI (@BCCI) September 20, 2024
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి రోజు మ్యాచ్‌లో అద్భుతమైన మాస్టర్ క్లాస్ అందించాడు. అతను తన కెరీర్‌లో ఆరో సెంచరీని సాధించాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి టీమ్ ఇండియాను గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..