ఐసీసీ తలపు తట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. మాంచెస్టర్ ఫలితంపై నిర్ణయం తీసుకోవాలంటూ లేఖ.. అసలేం జరుగుతోందంటే?

|

Sep 12, 2021 | 7:33 AM

IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. సిరీస్ నిర్ణయానికి సంబంధించిన విషయాలు కూడా ఇంకా నిర్ణయించలేదు.

ఐసీసీ తలపు తట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు..  మాంచెస్టర్ ఫలితంపై నిర్ణయం తీసుకోవాలంటూ లేఖ.. అసలేం జరుగుతోందంటే?
Ecb Vs Bcci
Follow us on

IND vs ENG: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగాల్సిన భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇది సిరీస్‌ని నిర్ణయించే మ్యాచ్. కానీ చివరి మ్యాచ్ రద్దు కారణంగా, సిరీస్ భవిష్యత్తు ఎటూ తేలలేదు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కి ఐదవ టెస్ట్ మ్యాచ్‌ను నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించాలంటూ ఒక లేఖ రాసింది. ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు రద్దు చేశారు. టీమిండియా శిబిరంలో కోవిడ్ -19 కేసుల కారణంగా మ్యాచ్ రద్దు చేశారు. బుధవారం భారత రెండవ ఫిజియో యోగేష్ పర్మార్ టెస్ట్ ఫలితం పాజిటివ్‌గా వచ్చింది. దీంతో జట్టులో కోవిడ్ భయం వ్యాపించింది.

రద్దు చేసిన మ్యాచ్‌ని షెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు. బహుశా వచ్చే వేసవిలో భారత జట్టు ఇంగ్లండ్‌లో వన్డేలు, టీ 20 ల కోసం పర్యటించినుంది. ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ శుక్రవారం మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ను ఒకే టెస్ట్ మ్యాచ్‌గా చూస్తామని, ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో భాగంగా కాదు. ఇదే జరిగితే, ఆ మ్యాచ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోవచ్చు. ఆపై రెండు దేశాల మధ్య ప్రస్తుత సిరీస్‌ని నిర్ణయించాల్సి ఉంటుంది. అదే విషయాన్ని ఐసీసీ ముందు ఉంచేందుకు ఈసీబీ సిద్ధమైంది.

రెండు నిర్ణయాలు ఉండవచ్చు
ఈ విషయంలో రెండు నిర్ణయాలు ఉండవచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఐసీసీ డీఆర్‌సీ భావిస్తే, ఐదవ టెస్ట్ మ్యాచ్ లెక్కలోకి రాడు. అంటే అప్పుడు సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లను మాత్రమే తీసుకుంటారు. దీంతో టీమిండియా విజేతగా నిలవనుంది. ఐదవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు సిరీస్‌లో భారత్ 2-1తో ముందంజలో ఉంది. మరొక ఛాన్స్ ఏమిటంట.. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందని, ఇంగ్లండ్‌కు మ్యాచ్ ఫలితం అనుకూలంగా ఉంటుందని కమిటీ భావిస్తే.. సిరీస్ 2-2తో సమంగా ఉండేందుకు ఆస్కారం ఉంది.

డబ్ల్యూటీసీ నియమాలు..
డబ్ల్యూటీసీ నియమాల ప్రకారం.. “ఒకటి లేదా రెండు జట్లు ఏదైన కారణంగా మ్యాచ్ ఆడలేకపోతే మ్యాచ్ పాయింట్ల శాతం లెక్కలోకి తీసుకోరు.” ఐసీసీ కమిటీ నిర్ణయంపై ఆధారపడి ఈ ఫలితం ఆధారపడి ఉంటుంది. కోవిడ్ ప్రభావాల కారణంగా మ్యాచ్ ఆడలేకపోతే డబ్ల్యూటీసీ నిర్ణయాలు వర్తిస్తాయని, ఐదవ టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఈ నియమం వర్తిస్తుందని బీసీసీఐ గట్టిగా వాదిస్తోంది. అయితే ఇంగ్లండ్ మాత్రం ఈ మ్యాచ్‌ను కోవిడ్ కారణంగా రద్దు చేయాడాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈసీబీ దృష్టిలో, టీమిండియాలోని ఆటగాళ్లకు కోవిడ్ కేసులు లేవు. మానసిక ఆరోగ్యం, భద్రత కారణంగా తీసుకున్న నిర్ణయం అంటూ హారిసన్ పేర్కొంటున్నాడు.

ఐసీసీ ఏం చేస్తుందంటే..
ఈ విషయంలో అనిశ్చితిని పెంచడానికి ఈసీబీ ఇష్టపడడం లేదు. కాబట్టి ఈ విషయంలో ఐసీసీకి లేఖ రాసింది. త్వరగా ఈ ప్రక్రియను ప్రారంభించాలని కోరింది. దీంతో మాంచెస్టర్ టెస్ట్‌లో ఏమి జరిగిందనే దానిపై ఐసీసీ ఒక స్వతంత్ర నివేదికను రూపొందిస్తుంది. దీని తరువాత ఈ నివేదిక డీఆర్‌సీకి సమర్పిస్తారు. దాంతో ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై కమిటీ నిర్ణయానిదే ఫైనల్ అని తెలుస్తుంది.

Also Read: టీమిండియా ఆల్ రౌండర్‌ కుటుంబంలో వివాదం.. సోదరి, భార్యల మధ్య చిచ్చు పెట్టిన కోవిడ్ -19 రూల్స్.. ఎందుకో తెలుసా?

Us Open 2021: మహిళల సింగిల్స్‌ విజేతగా కొత్త ఛాంపియన్.. ఫైనల్లో ఎమ్మా రదుకను అద్భుత విజయం