ఒకరిద్దరు కాదు, 11మందితో స్పిన్ వేయించినా నో ప్రాబ్లం.. ఇన్నాళ్లకు దొరికాడ్రా అసలైన హీరో..!

Devdutt Padikkal Century: శ్రీలంక జట్టుతో తొలి టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 377 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఒకరిద్దరు కాదు, 11మందితో స్పిన్ వేయించినా నో ప్రాబ్లం.. ఇన్నాళ్లకు దొరికాడ్రా అసలైన హీరో..!
Sunil Gavaskar Comments On Padikkal

Updated on: Aug 16, 2026 | 4:42 PM

Devdutt Padikkal Century: లంకతో గాలేలో తొలి టెస్ట్ ఆడుతోన్న భారత జట్టు బలమైన స్థితిలో నిలిచింది. ఇందుకు ముఖ్య కారణం దేవదత్ పడిక్కల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో భారత ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ ఆడడంలో తేలిపోతున్నారనే ముద్ర ఉంది. కానీ, తాజాగా లంక జట్టును ఓ టీమిండియా కుర్రాడు మైదానంలో సంచలనం సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో కదంతొక్కాడు. లంక స్పిన్నర్లను చీల్చిచెండాడుతూ ఏకంగా 167 పరుగులతో భారత క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు.

స్పిన్ బూచీకి చెక్.. క్రీజులో అడుగుపెట్టగానే బౌండరీ..

గత కొంతకాలంగా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్నారు. ఈ బలహీనతను పారద్రోలుతూ వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే కళ్లుచెదిరే బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని కుండబద్దలు కొట్టాడు.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

ఇవి కూడా చదవండి

తొలిరోజు ఆట ముగిసే సమయానికి 178 బంతుల్లో 12 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 131 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. లంక స్టార్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందుకు వచ్చి లాంగ్ ఆన్ మీదుగా కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పడిక్కల్ ఆడుతున్న తీరు చూస్తుంటే రెండో రోజు అవలీలగా డబుల్ సెంచరీ సాధించేలా కనిపిస్తున్నాడు.

బ్యాక్‌ఫుట్ పవర్‌తో గవాస్కర్ ప్రశంసల వర్షం..

స్లో టర్నింగ్ పిచ్‌లపై స్పిన్‌ను ఎదుర్కోవడానికి పడిక్కల్ ఎంచుకున్న వ్యూహం పట్ల భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అమితంగా ఆకట్టుకున్నాడు. ఫీల్డర్లు దూరంగా ఉన్నప్పుడు ఎంతో సునాయాసంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడని ప్రశంసించాడు. బ్యాక్‌ఫుట్ నుంచి షాట్లు ఆడటమే ఈ కుర్రాడి అసలైన బలమని విశ్లేషించాడు.

స్పిన్ పిచ్‌లపై బంతి గమనాన్ని పసిగట్టి బ్యాక్‌ఫుట్ మీద దాడి చేయడమే అత్యుత్తమ మార్గమని సన్నీ స్పష్టం చేశాడు. అవసరమైనప్పుడు క్రీజు వదిలి బౌలర్ తల మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి పంపగల సత్తా అతడి సొంతమని కొనియాడాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పడిక్కల్ లాంటి ఆటగాడు భారత జట్టుకు దేవుడిచ్చిన వరం లాంటివాడని కితాబిచ్చాడు.

మూడో స్థానానికి సరైనోడు.. మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు..

పడిక్కల్ ప్రదర్శనపై మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం సానుకూలంగా స్పందించాడు. గాయం నుంచి కోలుకుని సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి వచ్చినా సరే మూడో స్థానంలో పడిక్కల్‌నే కొనసాగించాలని సూచించాడు. స్పిన్ ఉచ్చులో చిక్కుకోకుండా అత్యంత సమర్థవంతంగా బంతిని ఎదుర్కోవడంలో అతడి టెక్నిక్ అమోఘమని ప్రశంసించాడు.

ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

టెస్ట్ క్రికెట్‌లో వన్‌డౌన్ స్థానం అత్యంత కీలకమైంది. దానికి తగ్గట్టుగా స్పిన్నర్లను డామినేట్ చేసే బ్యాటర్ దొరకడం టీమిండియా భవిష్యత్తుకు అత్యంత శుభ పరిణామమని మంజ్రేకర్ విశ్లేషించాడు. పడిక్కల్ ప్రదర్శన భారత జట్టు సెలెక్టర్ల నిర్ణయం ఎంత పక్కాగా ఉందో నిరూపిస్తోందని అభిప్రాయపడ్డాడు.

టీమిండియాకు దొరికిన కొత్త ఆయుధం..

విదేశీ గడ్డపై స్పిన్నర్ల గుండెల్లో గుబులు రేపుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆటతీరు అభిమానులకు సరికొత్త ఆశలు కల్పిస్తోంది. బంతి టర్న్ అవుతున్నా ఏమాత్రం తడబడకుండా కచ్చితమైన ఫుట్‌వర్క్‌తో షాట్లు ఆడుతున్న తీరు అతడిలోని పరిణతిని తెలియజేస్తోంది. రాబోయే మ్యాచ్‌లలో స్పిన్ త్రయాన్ని దీటుగా ఎదుర్కోవడానికి భారత జట్టుకు ఈ కుర్రాడు ఒక బ్రహ్మాస్త్రంలా మారనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us