IPL 2021, RR vs DC: ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో భాగంగా నేడు అబుదాబిలో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ టీం రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోరే చేసినా.. ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రతిభతో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్స్‌ను కోలుకోకుండా చేశారు. దీంతో ఆర్‌ఆర్ టీంపై 33 పరుగుల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మరలా టాప్ ప్లేస్‌కు చేరుకుంది.
ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో భాగంగా నేడు అబుదాబిలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీం ముందు 155 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండు, ఐదు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది. డీసీ టీం ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ టీం 8 మ్యాచులు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి 8 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచంది.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలు ఇప్పటి వరకు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో రాజస్థాన్ టీం 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆధిక్యంలో నిలిచింది. ఢిల్లీ టీం 11 విజయాలను నమోదు చేసింది. ఇక యూఏఈలో తలపడిన రెండు సార్లు ఢిల్లీ క్యాపిటల్స్‌నే విజయం వరించింది.
మరోసారి రాజస్థాన్‌పై ఢిల్లీ టీం సత్తాను చాటింది. అబుదాబిలో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తెవాటియా (9) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఆరో వికెట్‌ను కోల్పోయింది. అన్‌రిచ్ నార్జే బౌలింగ్‌లో టీం స్కోర్ 99 పరుగుల వద్ద హెట్‌మెయర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
కష్టాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ టీం తరపున కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న కెప్టెన్ శాంసన్ 39 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి.
15 ఓవర్లకు రాజస్థాన్ టీం 5 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 41, రాహుల్ తివాటియా 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రియాన్ పరాగ్ (2) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం ఐదో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో టీం స్కోర్ 55 పరుగుల వద్ద బౌల్డయ్యాడు.
మహిపాల్ (19) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. రబాడా బౌలింగ్‌లో టీం స్కోర్ 48 పరుగుల వద్ద అవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
9 ఓవర్లకు రాజస్థాన్ టీం 3 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 13, మహిపాల్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
21/3 RR v DC అబుదాబి *
21/1 MI v PBKS చెన్నై
24/4 CSK v MI దుబాయ్
25/1 KKR v RR ముంబై
6 ఓవర్లకు రాజస్థాన్ టీం 3 వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్ 5, మహిపాల్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
డేవిడ్ మిల్లర్ (7) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 17 పరుగుల వద్ద పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
3 ఓవర్లకు రాజస్థాన్ టీం రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్ 6, శాంసన్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
జైస్వాల్ (5) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. అన్రిచ్ నార్ట్జే బౌలింగ్‌లో టీం స్కోర్ 6 పరుగుల వద్ద పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
లివింగ్ స్టోన్ (1) రూపంలో రాజస్థాన్ రాయల్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో టీం స్కోర్ 6 పరుగుల వద్ద పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
155 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు జైస్వాల్, లివింగ్‌స్టోన్ బరిలోకి దిగారు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందు 155గా ఉంచింది.
అక్షర్ పటేల్ (12) రూపంలో ఢిల్లీ టీం 6వ వికెట్‌ను కోల్పోయింది. సకారియా బౌలింగ్‌లో టీం స్కోర్ 142 పరుగుల వద్ద మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
18 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఐదు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. క్రీజులో లలిత్ యాదవ్ 10 , అక్షర్ పటేల్ 6 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
హిట్ మెయర్(28 పరగులు, 16 బంతులు, 5ఫోర్లు) రూపంలో ఢిల్లీ టీం 5వ వికెట్‌ను కోల్పోయింది. ముస్తఫిజుర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 121 పరుగుల వద్ద చేతన్ సకారియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
16 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రీజులో లలిత్ యాదవ్ 3 , హిట్‌మేయర్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 16 వ ఓవర్‌లో హిట్ మేయర్ మూడు ఫోర్లతో కార్తీక్ త్యాగిని టార్గెట్ చేసి మరీ బాదేశాడు.
15 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం నాలుగు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. క్రీజులో లలిత్ యాదవ్ 2 , హిట్‌మేయర్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
శ్రేయాస్ అయ్యర్ (43) రూపంలో ఢిల్లీ టీం 4వ వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ తివాటియా బౌలింగ్‌లో టీం స్కోర్ 90 పరుగుల వద్ద శాంసన్ స్టంపింగ్ చేయడంతో పెవిలియన్ చేరాడు.
13 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం మూడు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 43, హిట్‌మేయర్ 3 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
రిషబ్ పంత్ (24) రూపంలో ఢిల్లీ టీం 3వ వికెట్‌ను కోల్పోయింది. ముస్తఫిజర్ బౌలింగ్‌లో టీం స్కోర్ 83 వద్ద బౌల్డయ్యాడు.
10 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 27, రిషబ్ పంత్ 19 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
8 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాష్ అయ్యర్ 15, రిషబ్ పంత్ 12 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
తొలి పవర్ ప్లే అంటే 6 ఓవర్లు ముగిసేలోపు రాజస్థాన్ బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లపై పూర్తి ఆధిక్యం ప్రదర్శించారు. ఢిల్లీ టీం 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. ఇందులో ఢిల్లీ టీం కేవలం మూడు ఫోర్లు కొట్టడం గమనార్హం.
ఆరు ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయాష్ అయ్యర్ 9, రిషబ్ పంత్ 7 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
పృథ్వీ షా (10) రూపంలో ఢిల్లీ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో టీం స్కోర్ 21 వద్ద లివింగ్ స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
శిఖర్ ధావన్ (11) రూపంలో ఢిల్లీ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో టీం స్కోర్ 18 వద్ద బౌల్డయ్యాడు.
రెండు ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ టీం వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్ 7, పృథ్వీ షా 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ ఓడి ఢిల్లీ క్యాపిటల్స్ టీం బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, పృథ్వీ షా బరిలోకి దిగారు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), లలిత్ యాదవ్, షిమ్రాన్ హిట్మైర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కాగిసో రబాడా, అన్రిచ్ నార్త్జే, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్, తబరైజ్ షమ్సీ
రాజస్థాన్ రాయల్స్ టీం టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.
? Toss Update ?@IamSanjuSamson has won the toss & @rajasthanroyals have elected to bowl against @DelhiCapitals. #VIVOIPL #DCvRR
Follow the match ? https://t.co/SKdByWvPFO pic.twitter.com/J520sRNtcm
— IndianPremierLeague (@IPL) September 25, 2021
Beating the heat ☀️, the @SHetmyer style! ? ?#VIVOIPL #DCvRR pic.twitter.com/boqcVqQ3oG
— IndianPremierLeague (@IPL) September 25, 2021
ఐపీఎల్ 2021లో భాగంగా 36 వ మ్యాచులో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
Hello & welcome from Abu Dhabi for Match 3⃣6⃣ of the #VIVOIPL ?
It’s the @RishabhPant17-led @DelhiCapitals who will take on @IamSanjuSamson‘s @rajasthanroyals. ? ?#DelhiCapitals or #RR – which team are you rooting for? ?? #DCvRR pic.twitter.com/vkwJLmzxId
— IndianPremierLeague (@IPL) September 25, 2021