
Delhi Capitals Bengaluru Retained and Released Players Full List: గత IPL 2025 సీజన్‌లో మిశ్రమ ఫలితాలను చవిచూసిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు, ఐపీఎల్ 2026 కొత్త సీజన్ కోసం స్పష్టమైన వ్యూహంతో తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. రిటెన్షన్ విండో ముగియడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ తమ అత్యంత నమ్మకమైన ఆటగాళ్లను నిలబెట్టుకుంటూ, జట్టులో సమతుల్యతను సాధించడానికి కొన్ని కీలక మార్పులు చేసింది.
ఆల్‌రౌండర్ అక్సర్ పటేల్ (Axar Patel) సారథ్యంలో, సీనియర్ బ్యాటర్ కె.ఎల్. రాహుల్ (KL Rahul), స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ (Kuldeep Yadav) వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు వెన్నెముకగా నిలిచారు. అయితే, ఫాఫ్ డు ప్లెసిస్ వంటి స్టార్ ఆటగాడిని విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కోర్‌ను నిలబెట్టుకుంటూ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..
అక్సర్ పటేల్ (Axar Patel) (కెప్టెన్)
కె.ఎల్. రాహుల్ (KL Rahul)
కులదీప్ యాదవ్ (Kuldeep Yadav)
మిచెల్ స్టార్క్ (Mitchell Starc)
టీ నటరాజన్ (T Natarajan)
ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs)
సమీర్ రిజ్వీ (Sameer Rizvi)
కరుణ్ నాయర్ (Karun Nair)
అభిషేక్ పోరెల్ (Abishek Porel)
ఆశుతోష్ శర్మ (Ashutosh Sharma)
విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam)
మాధవ్ తివారి (Madhav Tiwari)
త్రిపురాణ విజయ్ (Tripurana Vijay)
అజయ్ మండల్ (Ajay Mandal)
ముకేశ్ కుమార్ (Mukesh Kumar)
దుష్మంత చమీరా (Dushmantha Chameera)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్ల వివరాలు ఓసారి చూద్దాం..
ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du Plessis)
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (Jake Fraser-McGurk)
సెదికుల్లా అటల్ (Sediqullah Atal)
మాన్వంత్ కుమార్ (Manvanth Kumar)
మోహిత్ శర్మ (Mohit Sharma)
దర్శన్ నల్కండే (Darshan Nalkande)
డొనోవన్ ఫెరీరా (Donovan Ferreira) (రాజస్థాన్ రాయల్స్ (RR)కి ట్రేడ్ అయ్యాడు).
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఐపీఎల్ 2026 మినీ-వేలంలో ఖర్చు చేయడానికి మిగిలిన బడ్జెట్ వివరాలు:
వేలం బడ్జెట్ (Auction Budget): రూ. 21.80 కోట్లు
అక్సర్ పటేల్, కె.ఎల్. రాహుల్, కులదీప్ యాదవ్ చుట్టూ తమ కోర్‌ను నిర్మించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, మిగిలిన బడ్జెట్‌తో మినీ-వేలంలో తమ జట్టుకు అవసరమైన ఫినిషర్ల కోసం, విదేశీ పేస్ ఎంపికల కోసం వెతకాలని చూస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..