ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ముద్దుల కూతురుకు ఇష్టమైన ఆటగాడు ఎవరో తెలుసా…? తన బిడ్డకు ఫేవరెట్ ప్లేయర్ పేరును వార్నరే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాజాగా ప్రకటించాడు. ఇంతకీ ఆ చిన్నారికి ఇష్టమైన ఆటగాడు భారత జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ. అవును విరాటే… ఈ విషయాన్ని వార్నర్ ఇలా తెలిపాడు… మేం సిరీస్ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది. అంటూ క్యాప్షన్ జతచేశాడు. కాగా ఆసీస్ పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది. కాగా… వార్నర్ లాక్‌డౌన్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఇండియన్ సినిమా పాటలకు.. తెలుగు సినిమా డైలాగులతో పేరడీలు చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.