Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మధ్య పోరు కొనసాగుతోంది. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఇబ్బంది పెట్టింది. దీంతో ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను విడుదల చేయలేకపోయింది. ఈ క్రమంలోనే పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటన వ్యవహారం మరింత క్లిష్టతరం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశంలోనే టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఐసిసి ఈ వారం షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని చాలా నివేదికలు పేర్కొంటున్నాయి. షెడ్యూల్‌ను ఈ నెల మొదట్లో విడుదల చేయాల్సి ఉంది. అయితే, భద్రతా సమస్యల కారణంగా భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి BCCI నిరాకరించడంతో అది ఆలస్యం అయింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని బీసీసీఐ కోరుతోంది. కానీ, పీసీబీ నిరాకరించింది. ఇప్పుడు ఈ అంశంపై ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఒకవేళ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నుంచి తరలించినా లేదా హైబ్రిడ్ మోడల్‌లో ఆడినా, పాకిస్తాన్ ఈ టోర్న నుంచి వైదొలగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ క్రికెట్‌కే కాదు ఐసీసీకి కూడా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతుందని సోమవారం పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. ఐసిసి తన విశ్వసనీయతను కాపాడుకోవాలని అభ్యర్థించాడు. బిసిసిఐకి ఏవైనా ఆందోళనలు ఉంటే, దానిని పిసిబితో పరిష్కరించుకోవచ్చని సూచించాడు.
1. ఐసీసీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అది అంత సులభం కాదు. భారత్‌ను పాకిస్తాన్‌లో ఆడమని అడగవచ్చు లేదా భారత్‌ను ట్రోఫీ నుంచి తప్పించవచ్చు. టీమ్ ఇండియా స్థానంలో, క్వాలిఫైయింగ్‌లో విజయం సాధించని ఇతర ఉన్నత ర్యాంక్ జట్టును చేర్చుకోవచ్చు. అయితే, ఇది జరిగేలా కనిపించడం లేదు. భారత జట్టు లేకుండా ఐసీసీ ఏదైనా టోర్నీ నిర్వహిస్తే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆ టోర్నీ ఉత్సాహంగా ఉండదు. బ్రాడ్‌కాస్టర్ కూడా దీనికి అంగీకరించదు.
2. హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించే అవకాశం కూడా ICCకి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ ఖచ్చితంగా ఆతిథ్య హక్కులను కలిగి ఉంటుంది. కానీ, టీమ్ ఇండియా తన మ్యాచ్‌లను వేరే దేశంలో ఆడవచ్చు.
3. ఐసీసీ మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్ వెలుపలికి మార్చడం మూడవ ఎంపిక.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..