IPL 2021: అనుకున్న టైమ్‌కు ఐపీఎల్‌ టోర్నమెంట్‌ జరిగేనా?

కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ -2021 టోర్నమెంట్‌ను తిరిగి అర్జెంట్‌గా కండక్ట్‌ చేసి డబ్బు గడించాలనే ఆత్రుతతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఉంది..

IPL 2021: అనుకున్న టైమ్‌కు ఐపీఎల్‌ టోర్నమెంట్‌ జరిగేనా?
Ipl
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 29, 2021 | 11:01 AM

కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ -2021 టోర్నమెంట్‌ను తిరిగి అర్జెంట్‌గా కండక్ట్‌ చేసి డబ్బు గడించాలనే ఆత్రుతతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఉంది.. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను వీలైనంత త్వరగా నిర్వహించేసి నాలుగు కాసులు కూడబెట్టుకుని చేతులు దులుపుకోవాలను కుంటోంది.. ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం ఇవాళ తేలిపోనుంది. శనివారం జరిగే బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఐపీఎల్‌ జరగకపోతే తమకు బోలెడంత నష్టాలు వస్తాయంటోంది వరల్డ్‌ రిచ్చెస్ట్‌ బాడీ అయిన బీసీసీఐ. అందుకే ఎస్‌జీఎంలో ఇదే ప్రధాన అజెండా కాబోతున్నది.

కరోనా సెకండ్‌వేవ్‌ విలయాన్ని సృష్టిస్తున్న ఈ తరుణంలో ఐపీఎల్‌ను నిర్వహించడం సబబేనా అన్న ప్రశ్నలు తలెత్తకుండా ఉండేందుకు మిగిలిన మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించాలనుకుంటోంది. క్రితంసారి జరిపినట్టుగానే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పోటీలు నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తోంది.. పది రోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున, వారం రోజుల పాటు రోజుకో మ్యాచ్‌ చొప్పున, మిగిలిన నాలుగు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లను వీకెండ్‌లో నిర్వహిస్తే అనుకున్న షెడ్యూల్‌లో ఐపీఎల్‌ను పూర్తి చేయవచ్చని బీసీసీఐ అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్‌ ప్రిపరేషన్‌ అంతా అయ్యింది. ఇప్పుడు కావాల్సింది దీనికి అధికారికంగా ఆమోదముద్ర వేయడమే మిగిలింది.

ఇక బీసీసీఐ మీద టీ-20 వరల్డ్‌ కప్‌ను నిర్వహించే బాధ్యత కూడా ఉంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నమెంట్‌ అక్టోబర్‌-నవంబర్‌ మధ్యలో భారత్‌లో జరగాలి.. ఇది అనుకున్న సమయంలో జరుగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే కరోనా సెకండ్‌వేవ్‌ భయానకాన్ని సృష్టిస్తోంది.. మరోవైపు థర్డ్‌ వేవ్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీ-20 ప్రపంచకప్‌ టైమ్‌కు జరుగుతుందన్న నమ్మకం లేదు. అయితే ఈ మెగా టోర్నమెంట్‌ను మరో దేశానికి తరలించే ఆలోచన మాత్రం బీసీసీఐ చేయడం లేదు. ఈ విషయంలో ఆచితూచి ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. అక్టోబర్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి కొన్నాళ్ల తర్వాత నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్న భావనలో ఉంది. ఎనిమిది జట్లు ఉన్న ఐపీఎల్‌ టోర్నమెంట్‌ నిర్వహణకు ఇంత ఆపసోపాలు పడుతుంటే.. 16 జట్లు పాల్గొంటున్నటీ-20 వరల్డ్‌కప్‌ను ఎలా నిర్వహిస్తారంటున్నారు కొందరు.

మరిన్ని ఇక్కడ చూడండి: Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు…( వీడియో )

Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )

River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )