Virat Kohli-BCCI: కోహ్లీ స్టేట్‌మెంట్‌పై ఆగ్రహించిన బీసీసీఐ అధ్యక్షుడు.. యూఏఈ మీటింగ్‌లో అసలేం జరిగిందంటే?

భారత వన్డే జట్టు కెప్టెన్సీ మార్పు అంశంపై విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ వ్యతిరేక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ పనితీరుపై ప్రశ్నలు మొదలయ్యాయి.

Virat Kohli-BCCI: కోహ్లీ స్టేట్‌మెంట్‌పై ఆగ్రహించిన బీసీసీఐ అధ్యక్షుడు.. యూఏఈ మీటింగ్‌లో అసలేం జరిగిందంటే?
Bcci Ganguly, Virat Kohli

Updated on: Dec 16, 2021 | 2:04 PM

Virat Kohli-Sourav Ganguly: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ డిసెంబర్ 15న వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగడంపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్నీ ప్రకటనకు ఒకటిన్నర గంటల ముందు మాత్రమే తనకు సమాచారం అందిందని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విరాట్ కోహ్లి ఈ ప్రకటన తర్వాత బీసీసీఐ సౌరవ్ గంగూలీపై విమర్శలు వెల్లువెత్తాయి. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడంపై గంగూలీ మాట్లాడుతూ.. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగవద్దని తాను విరాట్‌ను కోరానని, అయితే అతను అంగీకరించలేదని చెప్పిన విషయం తెలిసిందే.

కోహ్లీ మీడియా సమావేశం అనంతరం బీసీసీఐ వర్కింగ్ స్టైల్‌పై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు గంగూలీపై దుష్ప్రచారం మొదలైంది. కాగా, టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ కోహ్లీతో మాట్లాడినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. దీనిపై సమావేశంలో చర్చించారు. అందులో తొమ్మిది మంది ఉన్నారు. పీటీఐ నివేదిక ప్రకారం, టీ20 కెప్టెన్‌గా వైదొలగడం సముచితమా అని కోహ్లీని అడిగినప్పుడు తొమ్మిది మంది వ్యక్తులు పాల్గొన్నారని బీసీసీఐ సీనియర్ అధికారి పేర్కొన్నారు. వీరిలో ఐదుగురు సెలక్టర్లు, ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జైషా, కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు.

కోహ్లీ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది..
ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో ఈ సమావేశం యూఏఈలో జరిగినట్లు సమాచారం. ఇందులో వర్చువల్ మీటింగ్ ద్వారా వీరంతా కలిశారు. అయితే, టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ కెప్టెన్సీని వదులుకుంటాడని ఆసమయంలో నిర్ణయించలేదు. కాబట్టి టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లీ ఈ చర్య తీసుకోవడం బోర్డుకు కూడా ఆశ్చర్యం కలిగించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగడం గురించి తెలిపాడు.

కోహ్లీ ప్రకటనపై గంగూలీ ఆగ్రహం..
విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ చేసిన ప్రకటన తర్వాత గంగూలీ చాలా కోపంగా ఉన్నట్లు అర్థమవుతోందని పీటీఐ రాసుకొచ్చింది. కానీ, బోర్డు ఛైర్మన్‌గా, అతను సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాడు. అనుభవజ్ఞుడైన బోర్డు అధికారి పీటీఐతో మాట్లాడుతూ, “బీసీసీఐకి ఇది చాలా క్లిష్టమైన సమస్య. బోర్డు ప్రకటన జారీ చేస్తే, అది కెప్టెన్ తప్పు అని రుజువు చేస్తుంది. ప్రకటన వెలువడకపోతే చైర్మన్‌పై ప్రశ్నలు తలెత్తుతాయి. కోహ్లి ప్రకటన వల్ల బోర్డు చాలా నష్టపోయింది. సమస్య ఏమిటంటే కమ్యూనికేషన్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: 2021 Rewind: ‘మ్యాటర్ ఏదైనా సోషల్ మీడియాలో మాదే హల్‌చల్’.. 2021లో సత్తా చాటిన క్రికెటర్లు ఎవరంటే?

Virat Kohli vs BCCI: వన్డే కెప్టెన్సీ వివాదానికి సెప్టెంబర్ ప్రకటనే కారణం: సునీల్ గవాస్కర్