Babar Azam Century: ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుతోపాటు బాబర్ ఆజం విమర్శలకు గురవుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఫ్లాప్ అయిన తర్వాత, బాబర్‌పై విమర్శల దాడి ఎక్కువైంది. ఇవన్నీ మర్చిపోయి వన్డే కప్‌లో ఆడుతున్న బాబర్‌కు.. అక్కడ కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అతడిని దూషించాడు. ఇది కెమెరాలో రికార్డైంది. ఇదంతా గమనించిన బాబర్.. తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. దీంతో సర్ఫరాజ్‌కు చెంపదెబ్బ కొట్టినట్లైంది. సర్ఫరాజ్ అహ్మద్ బాబర్‌ను ఎగతాళి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
బాబర్ అజామ్‌తో సహా పలువురు పాకిస్థానీ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో వన్డే కప్ ఆడుతున్నారు. స్టాలిన్ జట్టుకు ఆడుతున్న బాబర్ ఆజం ప్రారంభ మ్యాచ్‌లలో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు. సెప్టెంబరు 19న, బాబర్ ప్రత్యర్థి డాల్ఫిన్స్ జట్టులో భాగమైన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్, బాబర్‌ను మైదానంలో తీవ్రంగా అవమానించాడు. సర్ఫరాజ్ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. సర్ఫరాజ్ వీడియోలో మాటంలాడెతే, ‘బాబర్‌ని ఆడనివ్వండి. బాబర్‌కి 40 ఓవర్లు బౌల్ చేద్దాం. మిగతా వాళ్లంతా ఔట్ అవుతుంటారు’ అంటూ దూషించాడు.
Dear Sarfaraz Ahmed, if Babar’s team wins this one, find a place to Hide. As 152-0 is a reminder of what happens when u don’t get Babar Azam Out#BabarAzam𓃵 pic.twitter.com/VvfFnLpdTY
— King Babar Azam Gang (@BA56_MOB) September 19, 2024
మ్యాచ్‌లో బాబర్ ఆజం చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. బాబర్ వచ్చే సమయానికి అతని జట్టు 13 ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేసింది. దిగగానే స్టేడియం బాబర్ నినాదాలతో మారుమోగింది. బాబర్ 65 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి సెటిల్ అయ్యేందుకు సమయం తీసుకున్నాడు. కానీ, సర్ఫరాజ్ మాటలు విన్న బాబర్.. ఆ తర్వాత వేగం పెంచాడు. బాబర్ తర్వాతి 34 బంతుల్లో 50 పరుగులు పూర్తి అద్భుతమైన సెంచరీ సాధించాడు.
స్టాలియన్స్ జట్టు నిరంతరం కష్టపడుతున్నట్లు అనిపించింది. బాబర్ ఒక చివర నుంచి పరుగులు రాబడుతున్నా.. మరొక ఎండ్ నుంచి మాత్రం వికెట్లు పడుతూనే ఉన్నాయి. అయితే బాబర్ అజామ్ సెంచరీతో ఆ జట్టు స్కోరు బోర్డులో 271 పరుగులు చేరాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..