India knocked From WTC 2025 Final: ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1తో గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరుకుంది. అయితే, స్లో ఓవర్‌రేట్ కారణంగా పాయింట్లు కోల్పోవాల్సి వస్తుందా లేదా అనేది ఐసీసీ తేల్చాల్చి ఉంది. ఐసీసీ నిర్ణయం తర్వాతే ఆస్ట్రేలియా అధికారికంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
జూన్ 11న లార్డ్స్‌లో ప్రారంభమయ్యే WTC ఫైనల్‌లో పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని జట్టు ఇప్పటికే అర్హత సాధించిన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నెలాఖరులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది.
న్యూజిలాండ్‌తో 3-0తో ఓడిపోయిన తర్వాత సిరీస్‌లోకి వచ్చిన భారత్, ఆస్ట్రేలియాను ఓడించడం లేదా కనీసం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ని డ్రా చేసుకోవడం అవసరం. కానీ, సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి అధికారికంగా తప్పుకుంది. అలాగే, రోహిత్ కోహ్లీలు కూడా తమ చివరి ఆస్ట్రేలియా సిరీస్ ఆడినట్లేనని తెలుస్తోంది.
జట్టు | మ్యాచ్‌లు | గెలిచింది | ఓడిపోయింది | డ్రా | పాయింట్లు | PCT శాతం |
దక్షిణాఫ్రికా | 11 | 7 | 3 | 1 | 88 | 66.67 |
ఆస్ట్రేలియా | 17 | 11 | 4 | 2 | 130 | 63.72 |
భారతదేశం | 19 | 9 | 8 | 2 | 114 | 50.00 |
న్యూజిలాండ్ | 14 | 7 | 7 | 0 | 81 | 48.21 |
శ్రీలంక | 11 | 5 | 6 | 0 | 60 | 45.45 |
ఇంగ్లండ్ | 22 | 11 | 10 | 1 | 114 | 43.18 |
బంగ్లాదేశ్ | 12 | 4 | 8 | 0 | 45 | 31.25 |
పాకిస్తాన్ | 11 | 4 | 7 | 0 | 40 | 30.30 |
వెస్టిండీస్ | 11 | 2 | 7 | 2 | 32 | 24.24 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..