AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆసియా క్రీడల పతకాల వెనుక ఇంత కథ ఉందా.. ఆ విశేషాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..!

Asian Games Medals: జపాన్ (Japan) వేదికగా జరగనున్న ఇరవైవ ఆసియా క్రీడల (Asian Games 2026) పతకాల రూపకల్పన క్రీడా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. జాతీయ స్థాయి పోటీల ద్వారా ఎంపికైన ఈ మెడల్స్ వెనుక అద్భుతమైన సాంస్కృతిక విశేషాలు, సరికొత్త భావనలు దాగి ఉన్నాయి.

ఆసియా క్రీడల పతకాల వెనుక ఇంత కథ ఉందా.. ఆ విశేషాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..!
Asian Games Medals
Venkata Chari
|

Updated on: Sep 19, 2026 | 6:16 PM

Share

Asian Games Medals: జపాన్‌ (Japan) లోని ఐచి-నాగోయా నగరంలో ఆతిథ్యమివ్వనున్న ఇరవైవ ఆసియా క్రీడల (Asian Games 2026) పతకాల డిజైన్ ప్రపంచవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక పతకాలను ఒక జాతీయ స్థాయి డిజైన్ పోటీ ద్వారా ఎంపిక చేయడం విశేషం. ప్రముఖ జపనీస్ డిజైనర్ డైసుకే షీబా (Daisuke Shiba) ఈ పతకాల రూపురేఖలను అత్యంత సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ నమూనా క్రీడల అధికారిక నినాదమైన ‘ఇమేజిన్ వన్ ఏషియా’ అలాగే ‘వైవిధ్యంలో ఏకత్వం’ అనే ప్రధాన థీమ్‌ను ప్రతిబింబిస్తుంది. ఆటగాళ్ల ప్రయాణంలో ఎదురయ్యే కష్టనష్టాలు, గాయాలు, అపజయాల వంటి విభిన్న అనుభవాల సారాంశాన్ని ఈ డిజైన్ ప్రతిఫలిస్తుందని రూపకర్త వెల్లడించారు.

ఎక్కువమంది చదివినది: Team India: అందరికీ న్యాయం చేశారు.. కానీ, ఆ ఒక్కడినే ఎందుకు బలి చేశారు గంభీర్ జీ..!

ఈ పతకాల తయారీలో వాడిన పదార్థాలు, ప్రత్యేకతలు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని జపాన్ మున్సిపాలిటీలు సేకరించిన పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి సేకరించిన లోహాలతో వీటిని తయారు చేయడం ప్రధాన విశేషం. అలాగే పతకానికి ఉండే రిబ్బన్‌పై ఐచి ప్రాంతపు అధికారిక పువ్వు అయిన కాకిత్సుబాతా (Kakitsubata) రూపం అందంగా అద్దబడింది. అథ్లెట్ల కఠిన సాధన, వారి దృఢత్వాన్ని ఈ వంపుల నమూనా చాటిచెబుతుంది. ఈ పతకాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పెట్టెను ఐచి ప్రాంతపు ప్రసిద్ధ హినోకి (Hinoki) చెక్కతో తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Team India: పరుగెత్తలేడు, డైవ్ చేయలేడు.. టీమిండియాలో అత్యంత వరస్ట్ ఫీల్డర్ అతనే..!

కొలతలు, బరువుల విషయానికి వస్తే ప్రతి పతకం ఎనిమిది సెంటీమీటర్ల వ్యాసం, ఐదు సెంటీమీటర్ల మందంతో వృత్తాకారంలో రూపుదిద్దుకుంది. స్వర్ణ పతకం సుమారు రెండువందల అరవై 5 గ్రాముల బరువు కలిగి ఉండగా, స్వచ్ఛమైన వెండిపై ఒక గ్రాము బంగారం పూత పూశారు. రజత పతకం పూర్తిగా స్వచ్ఛమైన వెండితో 264 గ్రాముల బరువుతో తయారైంది. కాంస్య పతకం 95 శాతం రాగి, 5 శాతం జింక్ మిశ్రమంతో సుమారు 222 గ్రాముల బరువుతో రూపొందింది. కళాత్మకత, సాంస్కృతిక వారసత్వాన్ని జోడించి తయారు చేసిన ఈ పతకాలు టోర్నమెంట్‌పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us