PAK VS AFG: పోరాడి ఓడిన ఆఫ్గనిస్థాన్‌.. ఆదివారం ఫైనల్స్‌లో తలపడనున్న శ్రీలంక, పాక్‌..

|

Sep 07, 2022 | 11:15 PM

PAK vs AFG: ఆఫ్గనిస్థాన్‌ పోరాడి ఓడింది. ఆసియాకప్‌ టోర్నీలో సూర్‌-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌ పోరాడి ఓడింది. చివరికి పాకిస్థాన్‌ ఒక్క వికెట్‌ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల లక్ష్యాన్ని చివరి వికెట్‌ ఉండగా...

PAK VS AFG: పోరాడి ఓడిన ఆఫ్గనిస్థాన్‌.. ఆదివారం ఫైనల్స్‌లో తలపడనున్న శ్రీలంక, పాక్‌..
Pak Won The Match
Follow us on

PAK vs AFG: ఆఫ్గనిస్థాన్‌ పోరాడి ఓడింది. ఆసియాకప్‌ టోర్నీలో సూర్‌-4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గనిస్థాన్‌ పోరాడి ఓడింది. చివరికి పాకిస్థాన్‌ ఒక్క వికెట్‌ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల లక్ష్యాన్ని చివరి వికెట్‌ ఉండగా పాకిస్థాన్‌ చేధించింది. పాకిస్థాన్‌ బ్యాటర్స్‌లో ఇఫ్తీకర్‌ అహ్మద్‌ (30), షాహబ్‌ ఖాన్‌ (36) పరుగులతో రాణించారు. చివరగా బ్యాటింగ్ చేసిన నసీమ్‌ షా కేవలం 4 బంతుల్లోనే 14 పరగులు చేసిన పాక్‌ను విజయ తీరాలకు చేర్చాడు. దీంతో పాకిస్థాన్‌ ఆసియా కప్‌ 2022లో ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌, శ్రీలంక తలపడనున్నాయి. ఆఫ్గనిస్థాన్‌ ఓటమితో భారత్‌ ఫైనల్స్‌ వెళుతుందని ఉన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది.

ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆఫ్గన్‌ బ్యాటర్లు పరుగులు తీయడంలో ఇబ్బంది పడ్డారు. అఫ్గనిస్తాన్‌ బ్యాటర్లలో ఇబ్రహీ జర్దన్‌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హజరతుల్లా జజేయ్‌ 21, రహమనుల్లా గుర్బాజ్‌ 17 పరుగులు చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో హారిస్‌ రౌఫ్‌ 2, నసీమ్‌ షా, మహ్మద్‌ హుస్నైన్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

మరిన్ని క్రికెట్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..