అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!

వెస్టిండీస్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి వెస్టిండీస్‌పై టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ దూకుడైన ఇన్నింగ్స్‌తో టీమిండియా పవర్‌ప్లేలోనే భారీ స్కోరు సాధించింది.

అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
Abhishek Sharma Records

Updated on: Oct 11, 2026 | 7:48 PM

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఇండోర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ప్రత్యేక రికార్డు సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్‌పై టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో ఇంతకుముందు విరాట్ కోహ్లీ (Virat Kohli), సంజు శాంసన్ (Sanju Samson) 21 బంతుల్లో అర్ధశతకాలు సాధించి సంయుక్తంగా ముందున్నారు. ఇప్పుడు అభిషేక్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో ఆ రికార్డును అధిగమించాడు.

ఎక్కువమంది చదివినది: Team India: 3 మ్యాచ్‌ల్లో 3 పరుగులు.. మరోసారి విఫలం.. ఇక టీమిండియాలో నో ఛాన్స్..?

వెస్టిండీస్‌పై భారత్ తరపున అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీల జాబితాలో అభిషేక్ 18 బంతులతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 21 బంతుల్లో కోహ్లీ, 21 బంతుల్లో సంజు శాంసన్, 22 బంతుల్లో రోహిత్ శర్మ (Rohit Sharma) ఉన్నారు. రోహిత్ మరోసారి 23 బంతుల్లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 23 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.

అభిషేక్ శర్మకు టీ20ల్లో ఇది కూడా మరో వేగవంతమైన అర్ధశతకం. 2026లో గువాహటిలో న్యూజిలాండ్‌పై కేవలం 14 బంతుల్లో, ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌పై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2025లో ముంబై వాంఖడేలో ఇంగ్లాండ్‌పై 17 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఇప్పుడు వెస్టిండీస్‌పై 18 బంతుల్లో మరోసారి ఈ ఘనత అందుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: మన వాళ్లంతా దద్దమ్మలే.. టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ మ్యాచ్‌లో భారత జట్టు పవర్‌ప్లేలోనూ రికార్డు స్థాయి స్కోరు సాధించింది. తొలి ఆరు ఓవర్లలో 87/1 పరుగులు చేసింది. వెస్టిండీస్‌పై టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరుగా నిలిచింది. ఇంతకుముందు 2026లో రాంచీలో 79/1, 2019లో వాంఖడేలో 72/0, 2016లో లాడర్‌హిల్‌లో 67/2 భారత్ పవర్‌ప్లే స్కోర్లు సాధించింది.

అభిషేక్ శర్మ దూకుడుతో భారత్ ఇన్నింగ్స్‌కు భారీ ఊపు లభించింది. పవర్‌ప్లేలోనే 87 పరుగులు రావడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us