Buffalo: గేమ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి బహుమతులు ప్రకటించండం సర్వసాధారణం. అయితే పలుమార్లు ఆటగాళ్లకు విచత్రమైన బహుమతులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. టెన్నీస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ వంటి ఆటగాడికి స్విస్ ఓపెన్ జిస్టాడ్ రెండుసార్లు ఆవును బహుకరించింది. అయితే తాజాగా మనదేశంలోనే ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆగ్రాలో జరగుతున్న 23వ సీనియర్ మహిళల నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారిణికి బహుమతిగా గేదెను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
అదికూడా రిజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యుఎఫ్ఐ) ఈ బహుమతిని ప్రదానం చేయనుంది. రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తమ్ రెజ్లర్‌గా ఎంపికైన క్రీడాకారిణికి రూ. 1.5 లక్షల విలువైన గేదెను బహుమతిగా ఇవ్వనున్నట్లు ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ప్రసాద్ ప్రకటించారు. వాస్తవానికి ఈ బహుమతిని స్థానిక వ్యక్తి స్పాన్సర్ చేశారని చెప్పిన ఆయన.. గేదె వద్దనుకుంటే.. నగదు ఇచ్చేందుకు అతను సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.
Also read: