Ajinkya rahane: మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న రహానే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..

|

Jan 30, 2021 | 7:01 PM

Ajinkya rahane: ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత విజయం తరువాత అందరి మన్ననలు అందుకుంటున్న..

Ajinkya rahane: మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న రహానే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Follow us on

Ajinkya rahane: ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత విజయం తరువాత అందరి మన్ననలు అందుకుంటున్న భారత క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానే.. మరోసారి తన మాటలతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. తాజాగా రహానే చేసిన వ్యాఖ్యలు.. అతని మెచ్యూరిటీ లెవెల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పేస్తున్నాయి. విజయం సాధిస్తే పొంగిపోవడం.. ఓడిపోతే కుంగిపోవడం తనతత్వం కాదని నిరూపించుకున్నాడు. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ కొహ్లీ సారథ్యంలో జరగగా.. మిగతా మూడు మ్యాచ్‌లు రహానే సారథ్యంలో జరిగాయి. అటు సారథి కోహ్లీ లేకపోయినా.. సీనియర్లు సైతం గాయాల బెడదతో ఒక్కొక్కరుగా టీమ్‌కు దూరమయినా.. రహానే ఏమాత్రం వెరవలేదు. తన సమర్థతతో జట్టును అన్ని విధాలుగా గైడ్ చేస్తూ టెస్ట్ సిరీస్ టీమిండియా కైవసం అయ్యేందుకు కారకుడయ్యాడు.

ఈ అద్భుత విజయం అనంతరం భారత క్రికెట్ జట్టు సహా.. బృందం అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆ కేక్‌‌‌ను కట్ చేసేందుకు రహానే నిరాకరించాడు. అప్పుడు దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోనప్పటికీ తాజాగా కేక్ ఎందుకు కట్ చేయలేదనే అంశంపై రహానే క్లారిటీ ఇచ్చాడు. క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లేతో జరిపిన చిట్‌చాట్‌లో రహానే రహానే ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘కంగారూ ఆస్ట్రేలియా జాతీయ జంతువు. అందుకే ఆ బొమ్మ ఉన్న కేక్‌ను కట్ చేయలేదు. దేశమేదైనా సరే వారి గౌరవాన్ని కించపరచడం సరికాదనేది నా అభిప్రాయం. ఆటల్లో గెలుపోటములు సహజం. అయితే ప్రత్యర్థి దేశానికి ఎంత గౌరవం ఇచ్చామనేదే ఇక్కడ ముఖ్యం. దానిని దృష్టిలో ఉంచుకునే కంగారూ బొమ్మ కలిగిన కేక్‌ను కట్ చేయడానికి నిరాకరించాను’ అని రహానే చెప్పుకొచ్చాడు.

అయితే, రహానేకి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రహానే మాటలను విన్న నెటిజన్లు.. అతని పరిణతికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. రహానే బెస్ట్ పర్సన్ అంటూ కితాబిస్తున్నారు.

Ajinkya rahane Shared Video: