Vinayaka Chavithi 2024: వినాయక చవితికి మట్టి నుంచి లోహం వరకూ ఏ విగ్రహం తెస్తే ఏవిధమైన ఫలితం అంటే? ప్రతిష్ఠాపన విధానం ఏమిటి?

|

Sep 04, 2024 | 3:20 PM

వినాయక చవితి సందర్భంగా చాలా మంది మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అయితే వివిధ లోహలాతో చేసిన విగ్రహాన్ని చాలా పవిత్రంగా భావిస్తారో తెలుసా? వివిధ రకాల లోహాలు లేదా వస్తువులతో చేసిన విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఇంట్లో వినాయక చవితిని జరుపుకోవాలనుకుంటే.. ఇంటి సైజు ప్రకారం గణేశుడి విగ్రహం పరిమాణం ఉండాలి. చాలా పెద్ద లేదా చాలా చిన్న విగ్రహాన్ని తీసుకోవద్దు.

Vinayaka Chavithi 2024: వినాయక చవితికి మట్టి నుంచి లోహం వరకూ ఏ విగ్రహం తెస్తే ఏవిధమైన ఫలితం అంటే? ప్రతిష్ఠాపన విధానం ఏమిటి?
Lord Ganesha Idols
Follow us on

హిందూ మతంలో వినాయక చవితి పండుగకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ప్రత్యేక ఆచారం. అయితే ఈ వేడుకలకు విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం రెండింటినీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. వినాయక చవితిని జరుపుకోవడానికి మట్టి విగ్రహాలను ప్రతిష్టించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండవు. చాలా సులభంగా నిమజ్జనం చేయవచ్చు. అయితే మట్టి విగ్రహాలను మాత్రమే కాదు ఇత్తడి, రాగి లేదా పంచధాతు విగ్రహాలను ఇంటికి తీసుకురావడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

వినాయక చవితి సందర్భంగా చాలా మంది మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. అయితే వివిధ లోహలాతో చేసిన విగ్రహాన్ని చాలా పవిత్రంగా భావిస్తారో తెలుసా? వివిధ రకాల లోహాలు లేదా వస్తువులతో చేసిన విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో సంపదకు లోటు ఉండదు. ఇంట్లో వినాయక చవితిని జరుపుకోవాలనుకుంటే.. ఇంటి సైజు ప్రకారం గణేశుడి విగ్రహం పరిమాణం ఉండాలి. చాలా పెద్ద లేదా చాలా చిన్న విగ్రహాన్ని తీసుకోవద్దు. అయితే నచ్చిన ఏ భంగిమలోనైనా వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు.

హిందూ పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ 06న మధ్యాహ్నం 03:01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 07న సాయంత్రం 05:37 వరకు కొనసాగుతుంది. వినాయక చవితి రోజున మధ్యాహ్నం గణపతి పూజ సమయం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:33 వరకు ఉంటుంది. పూజ మొత్తం వ్యవధి 02 గంటల 31 నిమిషాలు.

ఇవి కూడా చదవండి

ఏ రకమైన విగ్రహం ప్రభావం ఎలా ఉంటుంది?

  1. గణేష్ చతుర్థి సందర్భంగా వెండి గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తే.. అది మీకు కీర్తిని తెస్తుంది.
  2. మామిడి, రావి, వేప చెక్కతో చేసిన విగ్రహాన్ని తీసుకురావడం వల్ల శక్తి, అదృష్టం కలుగుతుంది.
  3. ఇత్తడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సుఖ శాంతులు కలుగుతాయి.
  4. చెక్క విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుంది.
  5. స్ఫటిక గణేష్ విగ్రహం ఇంటి నుండి వాస్తు దోషాలను తొలగిస్తుంది. శుభాన్ని,అదృష్టాన్ని తెస్తుంది.
  6. కొత్తగా పెళ్లయిన జంటలు రాగి గణేష్ విగ్రహాన్ని ఇంటికి తీసుకుని రావడం శుభప్రదం.
  7. ఆవు పేడతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు.
  8. వినాయక చవితి రోజున పూజా ఏర్పాటు ఎలా చేయాలంటే
  9. వినాయక చవితి రోజున ఉదయం లేదా మధ్యాహ్నం శుభ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించండి. పంచాంగంకి చూసి శుభ సమయాన్ని తెలుసుకోవచ్చు.
  10. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఈ స్థలం శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండాలి.
  11. విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి దానిని అలంకరించండి. మండపాన్ని పువ్వులు, రంగోలి, విద్యుత్ దీపాలతో అలంకరించవచ్చు.
  12. మండపంలో కలశాన్ని ఏర్పాటు చేయండి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షతలు, కొన్ని నాణేలు వేసి మామిడి ఆకు పెట్టండి. ఆ మామిడి ఆకుపై కొబ్బరి కాయను పెట్టండి.
  13. కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్టించండి. విగ్రహం పాదాల దగ్గర చిన్న దీపం వెలిగించండి.
  14. విగ్రహాన్ని గంగాజలంతో స్నానం చేయండి. తర్వాత ధూప, దీప, నైవేద్యాలను సమర్పించాలి. గణేష్ స్తోత్రాన్ని పఠించండి.
  15. విగ్రహాన్ని పూలతో అలంకరించి గందం, తిలకం పూసి చివరకు గణేశుని ఆశీస్సులు పొందండి.
  16. వినాయకుని విగ్రహానికి క్రమం తప్పకుండా పూలు, నీటిని సమర్పించండి.

ఏ రంగు విగ్రహాన్ని తీసుకుని రావాలంటే

ఇంటిలో ప్రతిష్టించే వినాయకుని విగ్రహం రంగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్త విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లయితే దాని రంగు తెల్లగా ఉండేలా ప్రయత్నించండి. ఈ రంగు స్వచ్ఛతను సూచిస్తుంది .ఈ రంగు విగ్రహాన్ని తీసుకురావడం ఇంటికి శాంతి, శ్రేయస్సును తెస్తుంది. అంతేకాదు వినాయక చవితికి ఎడమ వైపున తొండం వొంపు ఉన్న గణేశుడి విగ్రహాన్ని తీసుకురండి. అలాంటి విగ్రహాన్ని తీసుకురావడం వల్ల ఐశ్వర్యం, సంతోషం కలుగుతాయి.

ఏ దిశలో విగ్రహాన్ని ప్రతిష్టించాలంటే

కొత్త విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తున్నట్లయితే అది కూర్చున్న భంగిమలో లేదా లలితాసన భంగిమలో ఉండాలి. ఈ ఆసనం లేదా భంగిమ మీకు శాంతి మరియు సౌకర్యాన్ని ఇస్తుంది. గణేశుడి విగ్రహం ప్రతిష్టాపనకు సరైన దిశలో ఇంటి తూర్పు, ఉత్తరం, ఈశాన్య మూలల్లో ఉంటుంది. ఈ దిశలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.