ఈ Ugadi ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!

Ugadi Meaning: ‘ఉగాది’ అంటే “యుగానికి ఆది” అని అర్థం. అంటే, కొత్త యుగానికి మొదటి రోజు అని చెప్పడమే. అందుకే ఈ పండుగకు యుగ + ఆది = ఉగాది అనే పేరు వచ్చింది. తెలుగు పంచాంగ ప్రకారం, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని నమ్మకం ఉండటంతో, ఆ రోజే ఉగాదిగా జరుపబడుతుంది. ఉగాది వసంత ఋతువులో వస్తుంది, ఇది ప్రకృతి పండుగ.

ఈ Ugadi ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
Ugadi Festival Significance

Updated on: Mar 16, 2026 | 6:42 PM

ఉగాది అంటే తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పండగ. తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రకృతిలో, ఇంట్లోనూ ఒక కొత్త అనుభూతిని, ఆనందాన్ని తీసుకొస్తుంది. ‘ఉగాది’ అంటే “యుగానికి ఆది” అని అర్థం. అంటే, కొత్త యుగానికి మొదటి రోజు అని చెప్పడమే. అందుకే ఈ పండుగకు యుగ + ఆది = ఉగాది అనే పేరు వచ్చింది. తెలుగు పంచాంగ ప్రకారం, చైత్ర శుద్ధ పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని నమ్మకం ఉండటంతో, ఆ రోజే ఉగాదిగా జరుపబడుతుంది.

పురాణకథలో ఉగాది

పురాణాల్లో చెప్పినట్టే, శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించడం కోసం సోమకుని వధ చేసి, వేదాలను బ్రహ్మ దేవునికి అప్పగించటం శుభ సమయం అని గుర్తించి, భక్తులు ఉగాది పండుగ జరుపుకునే ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే, చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడు, అందుకే సృష్టి ప్రారంభ సంకేతంగా ఉగాది జరుపుతారు అని పెద్దలు చెబుతారు.

ప్రకృతికి సంబంధించిన ఉగాది

ఉగాది వసంత ఋతువులో వస్తుంది, ఇది ప్రకృతి పండుగ. శీతాకాలం ముగిసి, చెట్లకు కొత్త చిగుర్లు వస్తూ, ప్రపంచం పచ్చగా మారే సమయమే ఈ పండుగ జరుపుకునే కాలం.

ఉగాది శోభ

  • ఉగాది రోజున: ఉదయం నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి.
  • నూతన వస్త్రాలు ధరించాలి.
  • ఇంటిని మామిడి తోరణాలు, పూల మాలలతో అలంకరించాలి.
  • పూజామందిరంలో గణపతి, లక్ష్మీదేవి, ఇష్టదేవత, కులదేవతలను ప్రతిష్ఠించాలి.
  • దీపారాధన చేసి, అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి.
  • సూర్యునికి అర్ఘ్యం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం ఉంది.

ఉగాది పచ్చడి: ఆరు రుచుల కలయిక

  • ఉగాది పచ్చడి అత్యంత ప్రత్యేకం. ఇందులో షడ్రుచులు (ఆరు రుచి) ఉంటాయి:
  • తీపి → బెల్లం
  • వగరు → కొత్త మామిడి
  • పులుపు → చింతపండు
  • రుచి → ఉప్పు
  • చేదు → వేప పువ్వులు
  • కారం → మిరియాలు

ఈ పచ్చడి తయారీ వెనుక అర్థం: సంవత్సరం మొత్తం ఎదురయ్యే కష్టాలు, సుఖాలు సమానంగా స్వీకరించగల సిద్ధతను పొందడం. పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజించి, తరువాత కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో విందు చేసుకోవాలి.

శాస్త్రీయత

వసంత ఋతువులో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కోసం వేప పువ్వులు వాడి పచ్చడి చేయడం శాస్త్రీయ ఆచారం.

ఉగాది సంబరాలు

  • మామిడి చెట్ల చిగుర్లను తినే కోయిల పక్షుల గానం వసంతం ప్రారంభం సూచిస్తుంది.
  • పంచాంగ శ్రవణం ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహ గతులు, పంటల పరిస్థితులు, వర్షాలు, యుద్ధాల అవకాశం, వ్యక్తిగత ఫలితాలు తెలుసుకోవచ్చు.
  • కవి సమ్మేళనాలు, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం వంటివి ఉగాది సాయంత్రం అద్భుతంగా జరుగుతాయి.
  • తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ప్రత్యేకంగా ఉగాది కొలువు నిర్వహించబడుతుంది.

పండుగలు: సంస్కృతి సంకేతాలు

పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాల గుర్తు. వాటిని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా పిల్లలకు మన సంప్రదాయాలు తెలియజేయవచ్చు. ప్రతి పండుగలోని ఆచారాలను భద్రంగా కాపాడటం ద్వారా మన భావితరానికి మన సంస్కృతి వారసత్వం అందుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us