తమ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలని అనుకోని వారుండరు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. కానీ లక్ష్మీ దేవి చంచలమైనది. ఎప్పుడూ స్థిరంగా ఒక చోట ఉండదు. కానీ లక్ష్మీ దేవి ఉన్నప్పుడే ఇంటిని చక్కదిద్దుకోవాలి. లక్ష్మీ దేవి తోడుగా ఉంటే ఎలాంటి కష్టనష్టాలకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అయితే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ పూజ గదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. పూజగదిలో కొన్ని రకాల వస్తువులను పెట్టండి. వీటిని ఇంట్లోని పూజ గదిలో ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మరి పూజగదిలో ఎలాంటి వస్తువులను పెట్టాలి? ఎలాంటి వస్తువుల్ని పెట్టడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పూజ గదిలో గంట అనేది ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. పూజ గదిలో గంట పెట్టడం వల్ల దుష్టవక్తలు తొలగిపోతాయి. ఆర్థిక బాధలు ఉండవు. సాధారణంగా గంటను అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు. కానీ పూజ గదిలోనే గంట ఉండేలా చేసుకోండి. ఇంట్లో గంట మోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఆర్థిక బాధలు కూడా తగ్గుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
నెమలి ఈకలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. నెమలి ఈకల్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని నమ్ముతారు. కానీ పూజ గదిలో ఉంచితే మరింత మంచిది. కాబట్టి నెమలి ఈకను మీ పూజగదిలో ఉండేలా చూసుకోండి. దీని వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
దీపం అనేది చీకటిని తొలగించి కాంతిని ఇస్తుంది. కాబట్టి పూజ గదిలో దీపాన్ని పెడుతూ ఉండటం వల్ల చాలా మంచిది. నిత్యదీపారాధన చేయడం చాలా మంచిది. అయితే పూజ గదిలో దీపాన్ని పెట్టినప్పుడు పడమర దిక్కు వైపు పెట్టండి.
పూజ గదిలో శంఖాన్ని పెట్టినా కూడా సిరి సంపదలు అనేవి బాగా కలిసి వస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే పూజ గదిలో నీళ్లు నింపిన చెంబు లేదా కలశం పెట్టినా చాలా మంచిది. ఆర్థిక సమస్యలు తొలగి.. ప్రశాంతంగా ఉండొచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.