IRCTC: హైదరాబాద్ నుంచి దక్షిణ భారత ఆలయ యాత్ర.. 7 రోజుల సూపర్ టూర్ ప్యాకేజీ ఇదే!

IRCTC South India Temple Tour Package Telugu: దక్షిణ భారతంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా IRCTC 7 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో మొదలయ్యే ఈ యాత్రలో తిరువనంతపురం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచ్చి, తంజావూరు సందర్శన ఉంటుంది.

IRCTC: హైదరాబాద్ నుంచి దక్షిణ భారత ఆలయ యాత్ర.. 7 రోజుల సూపర్ టూర్ ప్యాకేజీ ఇదే!
Irctc South India Temple Tour Package

Updated on: Oct 01, 2026 | 5:31 PM

IRCTC South India Temple Tour Package Telugu: దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే ట్రిప్‌లో సందర్శించాలనుకునే వారికి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. South India Temple Run (SHA23) పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో తిరువనంతపురం, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

2026 అక్టోబర్ 24 నుంచి 30 వరకు మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 24న ఉదయం 6:10 గంటలకు 6E 5278 విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి 7:55 గంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 30న రాత్రి 9:55 గంటలకు తిరుచ్చి నుంచి 6E 2171 విమానంలో బయలుదేరి రాత్రి 11:20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

ఏయే ప్రాంతాలు సందర్శిస్తారు?

  1. మొదటి రోజు తిరువనంతపురం చేరుకున్న తర్వాత పూవార్ ఐలాండ్, అజిమల శివ ఆలయం సందర్శిస్తారు.
  2. రెండో రోజు ఉదయం ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయం దర్శించుకుని కన్యాకుమారికి బయలుదేరుతారు. అక్కడ సన్‌సెట్ పాయింట్‌ను సందర్శిస్తారు.
  3. ఇవి కూడా చదవండి
  4. మూడో రోజు కన్యాకుమారి నుంచి రామేశ్వరం ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యంలో రాక్ మెమోరియల్, తిరువళ్ళువర్ విగ్రహం సందర్శిస్తారు.
  5. నాలుగో రోజు రామేశ్వరంలోని స్థానిక ఆలయాలతో పాటు ధనుష్కోడి సందర్శన ఉంటుంది.
  6. ఐదో రోజు అబ్దుల్ కలాం మెమోరియల్ సందర్శించి మదురై చేరుకుంటారు. అక్కడ ప్రసిద్ధ మీనాక్షి అమ్మవారి ఆలయం దర్శిస్తారు.
  7. ఆరో రోజు మదురై నుంచి తిరుచ్చి వెళ్లి అళగర్ కోయిల్, శ్రీరంగం ఆలయం, జంబుకేశ్వర ఆలయం సందర్శిస్తారు.
  8. చివరి రోజు తిరుచ్చి నుంచి తంజావూరు వెళ్లి చారిత్రక బృహదీశ్వర ఆలయం దర్శించుకుంటారు. అనంతరం తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ప్యాకేజీ ధర ఎంత?

ఒక్కరికి సింగిల్ ఆక్యుపెన్సీ రూ.58,250, డబుల్ ఆక్యుపెన్సీ రూ.44,800, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.42,100గా ఉంది. 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.36,250, బెడ్ లేకుండా రూ.29,950 కాగా, 2–4 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ.23,300గా ప్యాకేజీ ధర నిర్ణయించారు.

ప్యాకేజీలో ఏముంటాయి?

విమాన టికెట్లు, 6 రాత్రుల హోటల్ వసతి, 7 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 డిన్నర్లు, ఏసీ బస్సులో స్థానిక సందర్శనలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, IRCTC టూర్ ఎస్కార్ట్ సేవలు, వర్తించే పన్నులు ప్యాకేజీలో ఉన్నాయి. మొత్తం గ్రూప్ సైజ్ 29 మంది. అయితే లంచ్, విమానంలో భోజనం, ఆలయ దర్శనం/ఎంట్రీ టికెట్లు, వ్యక్తిగత ఖర్చులు, గైడ్ సేవలు, డ్రైవర్ లేదా గైడ్‌కు టిప్స్, హైదరాబాద్‌లో స్థానిక పికప్-డ్రాప్ వంటి ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.

ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి దక్షిణ భారత ఆలయ యాత్ర ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us