Garuda Puranam: ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే దరిద్రానికి, దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే.!

| Edited By: Anil kumar poka

Oct 08, 2021 | 8:42 PM

మహా పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. దీనికి ప్రధాన దేవుడు విష్ణువు. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ఏం చెయ్యాలి.? మరణం తర్వాత..

Garuda Puranam: ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేదంటే దరిద్రానికి, దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లే.!
Garuda Puranam
Follow us on

మహా పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. దీనికి ప్రధాన దేవుడు విష్ణువు. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు ఏం చెయ్యాలి.? మరణం తర్వాత ఉండే పరిస్థితులు ఏంటి.? అనే విషయాలను గరుడ పురాణం ప్రస్తావిస్తుంది. పాపాల నుంచి విముక్తి పొందటానికి ఎలాంటి పనులు చేయాలో గరుడ పురాణం వివరిస్తుంది. గరుడ పురాణంలో జీవితాన్ని మెరుగుపరచడానికి అన్ని నియమాలు చెప్పారు. దీనితో పాటుగా సూర్యారాధన పద్ధతి, దీక్షా పద్ధతి, శ్రద్ధా ఆరాధన, నవవ్యూహ ఆరాధన, భక్తి, జ్ఞానం, నిర్లిప్తత, ధర్మం, నిస్వార్థ చర్య, వైభవం ఇందులో తెలిపారు. ఈ గ్రంధం ప్రకారం.. ఈ ఐదు పనులు చేస్తే దరిద్రానికి, దురదృష్టానికి ఆహ్వానం పలికినట్లేనట..

దోపిడిదారుడు:

ఇతరుల నిస్సహాయతను అదునుగా చేసుకుని కొందరు డబ్బును సంపాదించాలని అనుకుంటారు. అంటే.. పేదలకు డబ్బులు ఇచ్చి.. వడ్డీల మీద వడ్డీలు వేస్తూ వారి నుంచి డబ్బులు గుంజుకునేవారు. అలాంటి వ్యక్తుల ఇళ్లల్లో నీరు తాగడం కూడా పాపంతో సమానం. ఆ వ్యక్తులు సంపాదించే డబ్బు.. వారితో పాటు ఇతరులకు కూడా మంచి చేయదు.

మాదకద్రవ్యాలను సరఫరా చేసేవాడు:

గరుడ పురాణం ప్రకారం, మాదకద్రవ్యాల వ్యాపారం చేసే వ్యక్తి చాలా మంది జీవితాలను నాశనం చేస్తాడు. అలాగే అతడి కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లో పడేస్తాడు. అలాంటి వ్యక్తుల ఇంట్లోకి అడుగు పెట్టడం కూడా పాపంగా పరిగణించబడుతుంది. వారి ఇంట భోజనం చేస్తే మిమ్మల్ని కూడా పాపంలో భాగస్వామిని చేస్తుంది.

అనారోగ్యంతో బాధపడుతోన్న వ్యక్తి:

సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంట్లో బ్యాక్టీరియా ఉండవచ్చు. అందువల్ల, అలాంటి ఇంట్లో ఆహారం తినకూడదు. ఒకవేళ తింటే మీ ఇంట్లో కూడా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది.

నేరచరిత్ర ఉన్న వ్యక్తి:

నేర చరిత్ర ఉన్న వ్యక్తులు నమ్మదగినవారు కాదు. వారి ఇంటి నీరు కూడా తాగకూడదు. ఒకవేళ చేస్తే మీరు కూడా వారి పాపంలో భాగస్వాములు అవుతారు.

కోపోద్రిక్తులు:

కొంతమంది ప్రతీ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. మరికొంతమంది చిన్న విషయానికి సైతం కోపం తెచ్చుకుంటారు. ఇలా ప్రతీ విషయానికి కోప్పడేవారి ఇంట్లో ఆహరం తింటే.. మీలో కూడా కోపం అనే భావన పెరుగుతుంది. అందువల్ల మీరూ ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తుల ఇంట్లో ఆహారాన్ని తినకూడదు.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆర్టికల్ ప్రచురితమైంది. దీనితో టీవీ9కి, టీవీ9 వెబ్‌సైట్‌కి ఎలాంటి సంబంధం లేదు)

Also Read: Samantha: సమంత-ప్రీతమ్‌‌ల మధ్య రిలేషన్ ఇదే.. క్లారిటీ ఇచ్చేసిన సామ్ మేకప్ ఆర్టిస్ట్..

Viral Video: చేపల వల వేసిన జాలర్లకు ఊహించని షాక్.. అందులో చిక్కింది చూసి ఫ్యూజులు ఔట్.!

మెరుగైన ఆరోగ్యం కోసం.. మీ డైట్‌లో ఈ 5 సూపర్ ఫుడ్స్‌ను తప్పనిసరిగా చేర్చుకోండి..

అదృష్టం పొందాలంటే.. ఈ వస్తువులను వెంటనే మీ పర్సు నుంచి తీసేయండి.!

10 ఓవర్లలో 32 పరుగులు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.. ప్రపంచకప్ అందించాడు.. ఈ ఆటగాడు ఎవరంటే.!