బోనాలపై కరోనా ఎఫెక్ట్ !

ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. ప్రతీఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. తమను చల్లగా చూడాలంటూ ప్ర‌జ‌లు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. జీహెచ్ఎంసీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల జాతర రద్దయ్యింది.

బోనాలపై కరోనా ఎఫెక్ట్ !
Follow us

| Edited By:

Updated on: Jun 10, 2020 | 2:24 PM

ఆషాఢం అనగానే గుర్తుకువచ్చేది బోనాలు. ప్రతీఏటా భాగ్యనగరంలో ఎంతో వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. తమను చల్లగా చూడాలంటూ ప్ర‌జ‌లు ఒక శక్తిస్వరూపాన్ని ఆరాధించడం ఆనవాయితీ. జీహెచ్ఎంసీలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల జాతర రద్దయ్యింది. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం బోనాల పండగ. హైదరాబాద్ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల జాతర ఇక లేనట్టే. జిహెచ్ఎంసీ పరిధిలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ ఏడాది బోనాల పండుగను రద్దు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం బోనాల పండుగ నిర్వహణపై నగర మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం ఈ ఏడాది బోనాల జాతరను రద్దు చేస్తున్నట్టు మంత్రి తలసాని ప్రకటించారు. అయితే ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని.. ప్రజలు మాత్రం ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకోవాలని తెలిపారు. గటాల ఊరేగింపు కూడా పూజారులే దేవాలయ పరిసరాల్లో ఉరేగిస్తారని అన్నారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా పూజరులే సమర్పిస్తారన్నారు. ఇందుకు గ్రేటర్ ప్రజలు సహకరించాలని కోరుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.