నితిన్‌ మ్యారేజ్‌కి ‘రంగ్‌దే’ టీమ్‌ గిఫ్ట్‌.. అదిరిపోయిందిగా

ఇవాళ వివాహం చేసుకోబోతున్న టాలీవుడ్ నటుడు నితిన్‌కి రంగ్‌ దే టీమ్‌ స్పెషల్ గిఫ్ట్‌ని ఇచ్చింది. మూవీ నుంచి ఓ టీజర్‌ని విడుదల చేసింది.

నితిన్‌ మ్యారేజ్‌కి 'రంగ్‌దే' టీమ్‌ గిఫ్ట్‌.. అదిరిపోయిందిగా
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2020 | 7:17 PM

Rang De  Team Gift to Nithiin: ఇవాళ వివాహం చేసుకోబోతున్న టాలీవుడ్ నటుడు నితిన్‌కి ‘రంగ్‌ దే’ టీమ్‌ స్పెషల్ గిఫ్ట్‌ని ఇచ్చింది. మూవీ నుంచి ఓ టీజర్‌ని విడుదల చేసింది. అందులో నితిన్‌, కీర్తి ఇద్దరూ కొత్తగా కనిపిస్తుండగా.. డైలాగ్‌లు బావున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ మెయిన్‌ అస్సెట్‌గా నిలిచింది. అయితే నితిన్‌ పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో పెళ్లి అంటే ఇష్టం లేని పాత్రలో కనిపించిన నితిన్ టీజర్‌ని రంగ్‌ దే టీమ్‌ విడుదల చేయడం గమనర్హం.

కాగా ఈ రోజు రాత్రి 8.30 గంటలకు నితిన్‌, షాలినిల వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. కోవిడ్‌ 19 నిబంధనలకు అనుగుణంగా వీరిద్దరి వివాహం జరగనుంది. తాజ్ ఫలక్ నుమా హోటల్ వేదికగా ఈ జంట ఒకటి కానుంది. ఈ పెళ్లికి వధూవరుల కుటుంబీకులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది.

Read This Story Also: కాబోయే భర్తకు నిహారిక స్పెషల్ విషెస్‌‌