న‌యా టెక్నాల‌జీ..జాకీల‌తో ఇళ్ల షిప్టింగ్…

టెక్నాల‌జీ రోజురోజుకు కొత్త పుంత‌లు తొక్కుతుంది. మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్ అందుకు వేదిక‌వుతుంది. సిటీలో రోడ్ల నిర్మాణ ప‌నులు అధికంగా జ‌రుగుతున్నందున కొన్నేళ్ల క్రింద‌ట ఎంతో ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టుకున్న ఇళ్లు.. ఇప్పుడు రోడ్డుకంటే చాలా వరకు దిగువ‌కు వెళ్లాయి. దీంతో వ‌ర్షాకాలంలో వ‌ర‌ద‌నీరంతా ఇళ్ల‌లోకి చేరుతుంది. వీటి నుంచి త‌ప్పించుకోవాలంటే కొత్త నిర్మాణాలు చేప‌ట్టాలి. ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. నిర్మాణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ఇళ్ల క‌ట్టడం పెద్ద రిస్క్ తో […]

న‌యా టెక్నాల‌జీ..జాకీల‌తో ఇళ్ల షిప్టింగ్...
Follow us

|

Updated on: May 27, 2020 | 7:15 PM

టెక్నాల‌జీ రోజురోజుకు కొత్త పుంత‌లు తొక్కుతుంది. మ‌హాన‌గ‌రం హైద‌రాబాద్ అందుకు వేదిక‌వుతుంది. సిటీలో రోడ్ల నిర్మాణ ప‌నులు అధికంగా జ‌రుగుతున్నందున కొన్నేళ్ల క్రింద‌ట ఎంతో ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టుకున్న ఇళ్లు.. ఇప్పుడు రోడ్డుకంటే చాలా వరకు దిగువ‌కు వెళ్లాయి. దీంతో వ‌ర్షాకాలంలో వ‌ర‌ద‌నీరంతా ఇళ్ల‌లోకి చేరుతుంది. వీటి నుంచి త‌ప్పించుకోవాలంటే కొత్త నిర్మాణాలు చేప‌ట్టాలి. ఇది చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. నిర్మాణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇలాంటి సమయంలో ఇళ్ల క‌ట్టడం పెద్ద రిస్క్ తో కూడుకున్న ప‌నే. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే తక్కువ ఖర్చుతో ఉన్న ఇళ్ల‌ను అలాగే పైకి ఎత్తే లేటెస్ట్ టెక్నాల‌జీ అందుబాటులోకి వచ్చింది. దీన్నే లిప్టింగ్ టెక్నాలజీ అంటారు. ఈ ప్ర‌క్రియ ద్వారా ఓ మోస్తారు బిల్డింగ్ ఎత్తు పెంచి, ఆధునీకరించేందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. ఇలా చెయ్య‌డం ద్వారా మరో 45 ఏళ్ల పాటు ఇళ్లు గట్టిగా ఉంటాయ‌ని, ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని ఆ రంగ నిపుణులు తెలిపారు. ఇళ్ల లిప్టింగ్ మాత్ర‌మే కాదు.. ఇతర చోటకు షిప్టింగ్ సైతం ఈ టెక్నాల‌జీ ద్వారా చేసేయెచ్చు.

వెహిక‌ల్ టైర్లు మార్చేందుకు ఉపయోగించే జాకీల సహాయంతో భ‌వ‌నాలను పైకి లేపుతున్నారు. ఇంటిని ఎత్తు పెంచేందుకు 2500 జాకీలను ఉపయోగిస్తున్నారు సంస్థ నిర్వాహ‌కులు. దీనికి 25 మంది కార్మికులు శ్ర‌మిస్తే 45 రోజుల పాటు స‌మ‌యం ప‌డుతుంది. బిల్డింగ్‌ మెటీరియల్‌కు రూ 10 లక్షలు, లేబర్‌ చార్జిగా మ‌రో రూ 10 లక్షలు ఖర్చవుతుందని ఈ టెక్నాల‌జీ ఉప‌యోగించే సంస్థ నిర్వాహ‌కులు చెబుతున్నారు.