ఒలింపిక్స్‌లో ‘బ్రేక్ డ్యాన్స్’

మీరు బ్రేక్ డ్యాన్సర్లా..? మీ డ్యాన్స్‌తో స్టేజ్‌ను బ్రేక్ చేయగలరా..? అయితే ఈ వార్త మీకోసమే. అన్ని కుదిరితే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ కూడా ఉండబోతుంది. 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను పెట్టాలనుకుంటున్నట్లు ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బక్ స్పష్టం చేశారు. బ్రేక్ డ్యాన్స్‌తో పాటు స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్‌లను కూడా ఒలింపిక్స్‌లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇటీవల సమావేశమై వీటిపై చర్చించారు. ఇందులో బ్రేక్‌డ్యాన్స్‌ను […]

ఒలింపిక్స్‌లో ‘బ్రేక్ డ్యాన్స్’
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 05, 2019 | 8:35 PM

మీరు బ్రేక్ డ్యాన్సర్లా..? మీ డ్యాన్స్‌తో స్టేజ్‌ను బ్రేక్ చేయగలరా..? అయితే ఈ వార్త మీకోసమే. అన్ని కుదిరితే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ కూడా ఉండబోతుంది. 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను పెట్టాలనుకుంటున్నట్లు ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బక్ స్పష్టం చేశారు. బ్రేక్ డ్యాన్స్‌తో పాటు స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్‌లను కూడా ఒలింపిక్స్‌లో చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇటీవల సమావేశమై వీటిపై చర్చించారు. ఇందులో బ్రేక్‌డ్యాన్స్‌ను కూడా ఒలింపిక్స్‌లో చేర్చాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. జూన్‌లో ఒలింపిక్ కమిటీ పూర్తి సభ్యులతో జరిగే సమావేశంలో దీని గురించి మరోసారి చర్చించబోతున్నారు.

దీనిపై ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బక్ మాట్లాడుతూ.. లింగ సమానత్వం, యువతకు ప్రాధాన్యం, గ్రామీణులకు మరింత ప్రాధాన్యం సూత్ర ప్రాతిపదికగా వీటిని ఒలింపిక్స్‌లో చేర్చాలని తాము అనుకుంటున్నట్లు చెప్పారు. అయితే బ్రేక్ డ్యాన్స్ మినహా మూడింటిని 2020 టోక్నోలో జరగబోతున్న ఒలింపిక్స్‌లో భాగం చేయనున్నారు. స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైబింగ్, సర్ఫింగ్… క్రీడలను టోక్నో ఒలింపిక్స్‌లో ఎలా నిర్వహిస్తారు? ఎలా విజేతలను నిర్ణయిస్తారనే విషయాలను పరిశీలించిన తర్వాతే పారిస్‌లో వీటిని భాగం చేయాలా? వద్దా? అనే విషయాలు ఫైనల్ చేయనుంది కమిటీ.