Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

రాగి పాత్రలు ఇంత డేంజరా ?

Copper has a natural presence in the human body along with many other minerals, రాగి పాత్రలు ఇంత డేంజరా ?

ఆరోగ్యానికి చాలా మంచివి అంటూ ఈ మధ్యకాలంలో ప్రచారం పెరిగిపోవడంతో చాలామంది వంటకోసం, తాగే నీళ్లను స్టోర్ చేసుకోవడం కోసం రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.. అయితే రాగిపాత్రలను ప్రతిసారీ ఉపయోగించడం అంత సేఫ్ కాదనే విషయం చాలా మందికి తెలియదు..
రాగిపాత్రల్లో వండినప్పడు, లేదా నిలువ ఉంచినప్పడు కొన్ని పదార్థాలు నెగటివ్ రియాక్షన్స్ ని ఇస్తుంటాయి.. మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి గిన్నెల్లో స్టోర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పుల్లదనానికి రాగిలో ప్రతిచర్యలు జరిగి అది తిన్నప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారచ్చు..అలాగే
వెన్న, క్రీం , పాలను స్టోర్ చేసినప్పడు కూడా అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక నిమ్మరసం, నారింజ రసం లాంటి సిట్రస్ జూస్లను రాగి గ్లాసుల్లో ఉంచితే డేంజర్ .. పెరుగును కూడా చాలామంది రాతిగిన్నెల్లో తోడు వేస్తుంటారు..అయితే అందులో ఉండే యాసిడ్స్ కాపర్ తో రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

రాగి మన శరీరంలోకి చేరడం వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర సమస్యలు కలుగుతుంటాయి. కడుపులో గ్యాస్, వాంతులు, విరేచనాలు తిమ్మిరి లాంటివి రావడానికి కారణం రాగి అధికంగా వాడటం వల్ల ఉండవచ్చు అని మనం గ్రహించాలి .మనిషి మెటబాలిసం ప్రకారం మన శరీరం రాగిని చిన్న మొత్తంలో ప్రాసెస్ చేయగలదు, కానీ అదే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు.

ఇక చిన్న పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించకపోవడమే మంచిది. మీరు రాగి పాత్రలను ఉపయోగిస్తూ పిల్లల్లో గ్యాస్ కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే రాగి పాత్రలు పక్కన పెట్టి, స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా టెఫ్లాన్ కోటింగ్ ఉన్న వంటసామాన్లను వాడటం మంచిది.

రాగి పాత్రల్లో ఏదైనా వంట చేసినప్పుడు, అది మాడిపోతే.. ఆ పాత్రలను తరువాత వాడకుండా వదిలేయడమే మంచిది..ఎందుకంటే, ఆ పాత్రలని అలాగే ఉపయోగిస్తూ వెళితే ఎక్కువ శాతం కాపర్ వచ్చి ఫుడ్ లో చేరే అవకాశముంటుంది.. అందుకే రాగి పాత్రలను, బాటిల్స్ ని ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అన్న విషయాలు సరిగ్గా తెలుసుకొని వాడటం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు.

Related Tags