Breaking News
  • ఢిల్లీ ఆనంద్ విహార్ లో అర్ధరాత్రి ఎన్కౌంటర్. ఏటీఎం దోపిడీ కేసులో వాంటెడ్ క్రిమినల్ కు బుల్లెట్ గాయాలు. పిస్టల్, మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్వేత ఆత్మహత్య కేసులో కొత్త కోణం . శ్వేత, ప్రియుడు అజయ్ కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టినట్లు విచారణ లో వెల్లడి . శ్వేత నుండి ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పాస్ వర్డ్ తీసుకొని అప్లోడ్ చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్న అజయ్ . సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టినందుకు నాపై కేసు పెట్టారు .. అజయ్ . నాపై కేసు పెట్టడం తో శ్వేత ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాను... అజయ్ . శ్వేత ఆత్మహత్య కేసులో అజయ్ పై అనుమానం ఉందంటున్న యువతి తల్లిదండ్రులు . అజయ్ తన కూతురును హత్య చేసి , ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపణ . గత నెల గత నెల 18 న ఇంటి నుండి అదృశ్యమైన శ్వేత . మరుసటి రోజు బీబీనగర్ సమీపంలోని NFC నగర్ రైలు పట్టాలు పై శ్వేత మృత దేహం గుర్తింపు . ఆత్మహత్య, హత్య అన్న కోణం లో కొనసాగుతున్న పోలీసుల విచారణ.
  • ఆందోళనకరంగా హీరో రాజశేఖర్‌ ఆరోగ్యం. కరోనాతో పోరాటం చేయటంలో నాన్న ఇబ్బంది పడుతున్నారు. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేయండి : హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక.
  • దీక్షిత్ ను కిరాతకమ్ గా చంపారు . కిడ్నాప్ అయిన రెండు గంటలకే దీక్షిత్ ను చంపిన కిడ్నాపర్లు . చంపిన తర్వాత డబ్బులు డిమాండ్ చేసారు . యాప్ కాల్ ద్వారా ఇంటర్నెట్ కాల్స్ చేసారు . మొత్తం నలుగురు ఇన్వాల్వ్ అయ్యారు . టీవీ 9 తో వరంగల్ ఐజీ నాగిరెడ్డి.
  • మగ బిడ్డకు జన్మనిచ్చిన కన్నడ నటి మేఘన రాజ్‌. ఇటీవల మరణించిన సాండల్ వుడ్ స్టార్ చిరంజీవి సర్జ భార్య మేఘన. చిరంజీవి సర్జ యాక్షన్ హీరో అర్జున్‌కు బంధువు.
  • 'కొమురం భీం అంటూ రామ్‌ చరణ్ వాయిస్‌లో వినిపించిన డైలాగ్స్‌'. ఫైనల్‌గా ఎన్టీఆర్‌ టీజర్‌ రిలీజ్ చేసిన ట్రిపుల్‌ ఆర్‌ టీం. రామ్ చరణ్ వాయిస్‌ ఓవర్‌తో తారక్‌ పాత్ర పరిచయం. కొమురం భీం లుక్‌లో అదుర్స్ అనిపించిన తారక్‌. తెలుగు సహా ఐదు భాషల్లో వాయిస్‌ ఓవర్‌ అందించిన రామ్‌ చరణ్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్.

ఇంతమందిని నవ్విస్తోన్న అవినాష్, సోహైల్‌ను ఏడిపించాడు

సోహైల్..గతంలో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితుడయ్యాడు.

Bigg Boss Telugu 4: Syed Sohail Ryan Cries, ఇంతమందిని నవ్విస్తోన్న అవినాష్, సోహైల్‌ను ఏడిపించాడు

సోహైల్..గతంలో పలు సీరియల్స్, సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితుడయ్యాడు. ముఖ్యంగా అతడి పేరు చెప్పగానే షార్ట్ టెంపర్ గుర్తుకువస్తుంది. “కథ వేరే ఉంటది”…రెగ్యూలర్‌గా ఈ డైలాగ్‌తో ఎదుటి వ్యక్తులపైకి దూసుకెళ్తుంటాడు సోహైల్. వ్యక్తిగతంగా మంచోడే అయినా కోపం అతడికి అపకీర్తిని తెస్తుంది. అద్బుతంగా టాస్కులు ఆడతాడు..జనాలతో బాగా కలిసిపోతాడు. తేడా వస్తే మాత్రం కథ వేరే ఉంటది. అమ్మాయిలు , అబ్బాయిలు ఎవరైనా సరే దూసుకువెళ్తాడు. నాగార్జునతో పాటు హౌస్‌లో తోటి సభ్యులు పలుమార్లు చెప్పినా సోహైల్ తన ప్రవర్తనను మార్చుకోలేకపోతున్నాడు. కాగా ఎప్పుడూ స్ట్రాంగ్‌గా కనిపించే సోహైల్..అక్టోబర్ 14న ఎపిసోడ్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు చాలా పెద్ద కారణమే ఉంది.‌

బుధవారం వరకు ఇంట్లో డీల్‌-నో డీల్‌ టాస్క్ కొనసాగింది. ఈ టాస్క్‌ల్లో భాగంగా కాస్త కఠినమైన టాస్క్‌లను ఇచ్చి బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులను పరీక్షించాడు. అందులో భాగంగా.. నిన్న పేడ టబ్‌లో బటన్స్‌ వెతికే డీల్‌ దివికి వచ్చింది. దీంతో టాస్క్‌‌లో భాగంగా దివి ధైర్యంగా ఆ పేడ తొట్టిలోకి దిగి 100 బటన్స్ కి గాను 93 బటన్స్‌ను దొరకబట్టింది. మరో టాస్క్‌లో భాగంగా అవినాష్‌ ముఖానికి లెగ్గింగ్ వేసుకుని అరటి పండు తిన్నాడు. అయితే నిన్నటి ఎపిసోడ్‌లో అసలు మ్యాటరంతా అఖిల్ చేసిన టాస్క్‌లోనే ఉంది.  ఓ కుర్చిలో కదలకుండా బిగ్ బాస్ టాస్క్ కంప్లీట్ అని చెప్పేవరకు అఖిల్ కుర్చోవాలి.  అతడిని ఇతరులు బలవంతంగా లేపకూడదు. ఈ క్రమంలో అతడిని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు. అఖిల్‌ కంట్లో షాంపూ పడటం గమనించిన మోనాల్‌ నీళ్లు పోయబోయింది.  మెహబూబ్‌, అభిజీత్ ఆమెను వారించారు. ఆ తర్వాత నోయల్‌ క్లాత్‌తో అఖిల్ కళ్లను తుడిచాడు. దానికి అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అఖిల్‌ ఉన్నాడు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు… అదే నేనో ఇంకెవరో కూర్చుంటే మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో అంటూ ‘సంచాలక్‌’గా చేస్తోన్న కెప్టెన్ సోహెల్‌ను ఉద్ధేశిస్తూ.. నువ్వు చేసేది కరెక్ట్‌ కాదు అన్నాడు. ( Bigg Boss 4 Telugu : కష్టపడకుండా కెప్టెన్ బట్ నో ఇమ్యునిటీ )

దీంతో సంచాలక్‌గా నిర్ణయాలు నా ఇష్టం అని సోహైల్‌ ఆన్సరిచ్చాడు. దానికి అవినాష్ ‘పొద్దున్నుంచి కడుపు కాల్చుకుని గేమ్స్‌ ఆడుతున్నాం.. మేము ఏమన్నా పిచ్చొళ్లమా’ అంటూ..తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. నన్ను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావ్‌ అంటారు. ఇది కాదా సేఫ్‌ గేమ్‌ అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఒకరిని సపోర్టు చేసుకుంటూ, ఇంకొకరిని సపోర్టు చేయడం లేదని ఆరోపించాడు. అయితే ఆ మాటలకు మొదట కోపంతో ఊగిపోయిన సోహైల్ తర్వాత కన్నీరు పెట్టుకున్నాడు. నేను ఎంత సర్దుకుపోతున్నా.. నన్ను ఇలా అంటున్నారని వెక్కి వెక్కి ఏడ్చాడు. దీంతో అఖిల్‌ వచ్చి అతడికి సర్దిచెప్పాడు.

Related Tags