వామ్మో ! టాయిలెట్ లో ప..ప..పాము !

ఎక్కడా లేనట్టు ఓ పాము బాత్ రూమ్ టాయిలెట్ బౌల్ లో కనబడడంతో.. అది చూసిన ఓ వ్యక్తి హడలెత్తిపోయాడు. అది మెల్లగా అందులోనుంచి బయటకు రాబోతుండగా..

వామ్మో ! టాయిలెట్ లో ప..ప..పాము !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 5:43 PM

ఎక్కడా లేనట్టు ఓ పాము బాత్ రూమ్ టాయిలెట్ బౌల్ లో కనబడడంతో.. అది చూసిన ఓ వ్యక్తి హడలెత్తిపోయాడు. అది మెల్లగా అందులోనుంచి బయటకు రాబోతుండగా ఆయన దాన్ని తొలగించేందుకు ఓ సాధనంతో ట్రై చేశాడు. దీంతో ఆ స్నేక్ కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించింది.  ఆ పెద్దమనిషి ఈ వీడియోనైతే తీశాడు గానీ చివరకు ఆ పాము ఏమైందో ఇందులో పూర్తిగా లేదు. టెక్సాస్ లో ఈ వ్యక్తి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి బాత్ రూమ్ లో కాలు పెట్టగానే ఈ దృశ్యం కనిపించిందట. బాత్ రూమ్ లోని ఈ ‘అనుకోని అతిథి’ తాలూకు వీడియోను సుమారు ఇరవై లక్షలమంది చూసి నోళ్లు వెళ్ళబెట్టారట.

ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొఛ్చి వణికిపోతున్నా అంటూ ‘పే టాన్  మేలోన్ ‘అనే ట్విటర్ యూజర్ దీన్ని షేర్ చేయగానే చాలామంది భయపడుతూనే ట్వీట్లు చేశారు. టాయిలెట్ మీద లిడ్ (మూత) పెట్టాలని మాత్రం చాలామంది సూచించారు.