సీతారాం ఏచూరి కాశ్మీర్ వెళ్ళవచ్చు…. సుప్రీంకోర్టు

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కాశ్మీర్ పర్యటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మహమ్మద్ అలీం సయీద్ అనే విద్యార్థి అనంత్ నాగ్ లోని తన తలిదండ్రులను చూసేందుకు అతనిని కూడా కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద విచారణ సందర్భంగా కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. కాశ్మీర్ లోని పరిస్థితి దృష్ట్యా.. శ్రీనగర్ వెళ్లలేకపోతున్నానని, తన పేరెంట్స్ ఎలా ఉన్నారో తనకు తెలియదని, అందువల్ల ఆ […]

సీతారాం ఏచూరి కాశ్మీర్ వెళ్ళవచ్చు.... సుప్రీంకోర్టు
Follow us

|

Updated on: Aug 28, 2019 | 12:33 PM

సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కాశ్మీర్ పర్యటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మహమ్మద్ అలీం సయీద్ అనే విద్యార్థి అనంత్ నాగ్ లోని తన తలిదండ్రులను చూసేందుకు అతనిని కూడా కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద విచారణ సందర్భంగా కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. కాశ్మీర్ లోని పరిస్థితి దృష్ట్యా.. శ్రీనగర్ వెళ్లలేకపోతున్నానని, తన పేరెంట్స్ ఎలా ఉన్నారో తనకు తెలియదని, అందువల్ల ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతించాలని మహమ్మద్ అలీం తన పిటిషన్ లో కోర్టును అభ్యర్థించాడు. ఇక్కడికి తిరిగి వచ్చిన అనంతరం అతడు అఫిడవిట్ సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే…. కాశ్మీర్లో తన పార్టీ సహచరుడైన మహమ్మద్ యూసుఫ్ తరిగామి ఆరోగ్యం బాగా లేదని, ఆయనను కలిసేందుకు తనను అనుమతించాలంటూ సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్ ను కూడా విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఇందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. మీ మిత్రుడ్ని కలుసుకోవడానికి మాత్రమే మీరు వెళ్తున్నారు.. ఇందులో ఇబ్బంది ఏముంది అని ఆయన ప్రశ్నించారు. అయితే… సీతారాం ఏచూరి కాశ్మీర్ పర్యటన రాజకీయంగా కనిపిస్తోందని, ఆయన విజిట్ వల్ల ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలగవచ్చునని కేంద్రం తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ.. కోర్టు ఈ వాదనను తొసిపుచ్ఛుతూ.. ఏచూరి తిరిగి వఛ్చిన అనంతరం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.