బిగ్ బాస్ 13: ప్లాస్టిక్ నిషేదిత సెట్‌.. బడా స్టార్లతో.. రంగం సిద్ధం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా బిగ్ బాస్ సీజన్ 13 అంగరంగ వైభవంగా మొదలైంది. షో ఆరంభం నుంచే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక దాన్ని రెట్టింపు చేస్తూ.. బీ టౌన్, టెలివిజన్ నుంచి బడా స్టార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో మొట్టమొదటిగా హౌస్‌లోకి ప్రవేశించిన సెలబ్రిటీ మహీరా శర్మ.. పలు హిందీ సీరియల్స్‌‌లో నటించిన ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. అయితే, హౌస్‌లోకి […]

బిగ్ బాస్ 13: ప్లాస్టిక్ నిషేదిత సెట్‌.. బడా స్టార్లతో.. రంగం సిద్ధం
Follow us

|

Updated on: Sep 30, 2019 | 6:00 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్టుగా బిగ్ బాస్ సీజన్ 13 అంగరంగ వైభవంగా మొదలైంది. షో ఆరంభం నుంచే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక దాన్ని రెట్టింపు చేస్తూ.. బీ టౌన్, టెలివిజన్ నుంచి బడా స్టార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో మొట్టమొదటిగా హౌస్‌లోకి ప్రవేశించిన సెలబ్రిటీ మహీరా శర్మ.. పలు హిందీ సీరియల్స్‌‌లో నటించిన ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. అయితే, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లిస్ట్ పరిశీలిస్తే అందరూ కూడా హేమాహేమీలే ఉన్నారని చెప్పొచ్చు.

‘ఉత్తరన్’ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మీ దేశాయ్.. ‘బాలికా వధూ’ ఫేమ్ సిద్ధార్థ్ శుక్లా అందరిలోనూ చెప్పుకోదగిన ఫేమస్ సెలబ్రిటీస్. ఆ తర్వాత కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, దేవోలీనా భట్టాచార్జీ, ఆర్తి సింగ్, పంజాబీ హీరోయిన్ షెహనాజ్ గిల్, యాంకర్ షెఫాలీ బగ్గా, మ్యూజిక్ డైరెక్టర్ అబూ మాలిక్, మోడల్ ఆసిన్ రియాజ్, పరాస్ చాబ్రా, సిద్ధార్థ్ డెయ్‌లు ఉన్నారు.

మునపటి సీజన్ల మాదిరిగానే ఈ సీజన్‌లో కూడా కావాల్సినంత రొమాన్స్, ట్విస్టులు ఉండేలా కనిపిస్తున్నాయి. అంతేకాక ఆఫ్ స్క్రీన్ బ్రేకప్ కపుల్ సిద్ధార్థ్ శుక్లా, రష్మీ ఇద్దరూ కూడా హౌస్‌లో ఉండటంతో మళ్ళీ వీళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుందని బీ-టౌన్‌లో టాక్ నడుస్తోంది. మరోవైపు ఈసారి బిగ్ బాస్ సెట్ పూర్తిగా ప్లాస్టిక్‌ను వాడకుండా తీర్చిదిద్దారు. దాదాపు 600 మంది కార్మికులు ఆరు నెలల పాటు శ్రమించి పూర్తి చేశారట. పీఓపీ, ఇతర మెటీరియల్ ఉపయోగించి ఆక‌ర్షిణీయంగా సెట్‌ని రూపొందించారని తెలుస్తోంది. ఇంటి ఫినిషింగ్ కోస‌మే దాదాపు 60 రోజులు పట్టిందని సమాచారం. దీని కోసం షో నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని వినికిడి. ఇకపోతే ఇప్పటివరకు బిగ్ బాస్ సెట్స్‌ను లోనావాలాలో తీర్చిదిద్దగా.. తాజా సీజన్ కోసం హౌస్ సెట్‌ను ముంబైలోని ఫిల్మ్ సిటీలో రూపొందించారు. హౌస్‌లో మొత్తం 93 కెమెరాలను అమర్చడంతో పాటు 14 బెడ్‌లను ఏర్పాటు చేశారు. ఇంత అద్భుతంగా సిద్దమైన బిగ్ బాస్ సీజన్ 13 ఎన్ని కాంట్రవర్సీ‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందో వేచి చూడాలి.