స్వతంత్ర భారత తొలి ఓటరు.. 31వ సారి ఓటేశారు

స్వతంత్ర భారత దేశపు తొలి ఓటరుగా పేరొందిన 102 ఏళ్ల శ్యాం శరణ్ నేగి.. ఈ ఎన్నికల్లో తన ఓటును హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా పాఠశాల కేంద్రంలో ఆయన ఓటేశారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సిబ్బంది.. దగ్గరుండి బ్యాండ్ బాజాతో గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు. #WATCH: 102-yr old Shyam Saran Negi, 1st voter of Independent India, cast his vote for #LokSabhaElections2019 […]

స్వతంత్ర భారత తొలి ఓటరు.. 31వ సారి ఓటేశారు
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 4:47 PM

స్వతంత్ర భారత దేశపు తొలి ఓటరుగా పేరొందిన 102 ఏళ్ల శ్యాం శరణ్ నేగి.. ఈ ఎన్నికల్లో తన ఓటును హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా పాఠశాల కేంద్రంలో ఆయన ఓటేశారు. ఆయన రాక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సిబ్బంది.. దగ్గరుండి బ్యాండ్ బాజాతో గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లారు.

ఓటేసిన అనంతరం సంతోషం వ్యక్తం చేసిన నేగి.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి వంద శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బంది నేగిని ప్రశంసించారు. 102 ఏళ్ల వయసులోనూ ఓటేసేందుకు వచ్చిన ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసిన నేగి.. ఆ తరువాత ప్రతి ఎన్నికల్లోనూ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 16 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో, 13 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, రెండు సార్లు కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటేశారు.