శ్రావణమాసం… చికెన్ బాబుల సంబరం!

Shravana masam effect on chicken and egg prices across the state, శ్రావణమాసం… చికెన్ బాబుల సంబరం!

గత నెలలో పరుగులు పెట్టిన చికెన్‌ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కిలో చికెన్‌ రూ.280 వరకు వెళ్లిన ధర ఇప్పుడు రూ.160కి(స్కిన్‌లెస్‌) దిగివచ్చింది. ధరలు సగానికి తగ్గినా కొనేవారు పెద్దగా కనిపించడం లేదు. శ్రావణ మాసం కావడంతో మాంసాహారానికి నగరవాసులు దూరంగా ఉంటున్నారు. ఆదివారం వచ్చిందంటే కోడి కూర లేకుండా ముద్ద దిగనివారు సైతం ఈ ఏడాది శ్రావణ మాసంలో అందుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క గ్రేటర్‌లో కోడిమాంసం డిమాండ్‌ కంటే సప్లయ్‌ అధికం కావడం వల్ల కూడా చికెన్‌ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. అదివారం మాత్రం అది 70 లక్షల కిలోకు పెరుగుతుంది. కానీ శ్రావణ మాసంలో విక్రయాలు గత నెలలో జరిగిన వ్యాపారంలో సగం కూడా ఉండడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.

శ్రావణ మాసం నేపథ్యంలో ఈ నెల మొదటివారం నుంచే చికెన్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. నగరంలో లక్ష కిలోలకు అటు, ఇటుగా విక్రయాలు జరుగుతాయి. ఇతర రోజులతో పోల్చితే శ్రావణంలో వినియోగం సగానికి సగం తగ్గింది. సాధారణ రోజుల్లో 80 కిలోల వ్యాపారం జరిగితే ఈ నెలలో మాత్రం 30 కిలోలు కూడా విక్రయించడం కష్టంగా ఉందని ఓ రిటైల్‌ వ్యాపారి పేర్కొన్నాడు. ఆదివారం రోజు కనీసం 150 కిలోలకు తగ్గకుండా విక్రయిస్తానని, గత ఆదివారం మాత్రం వ్యాపారం 60 కిలోలే జరిగినట్టు నాంపల్లికి చెందిన ఓ వ్యాపారి పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *