పోలీస్‌ల పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల మోసాల్లో షాకింగ్ నిజాలు. !

తెలంగాణ పోలీస్‌ల ప్రొఫైల్స్‌తో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బుగుంజుతోన్న ముఠా ఆటకట్టించారు నల్గొండ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 10 మంది పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ నుండి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుందని తెలిపారు. పోలీస్‌ల ప్రొఫైల్స్‌తో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, డబ్బు అవసరం ఉంది.. గూగుల్ పేలో మనీ పంపాలంటూ ఈ కన్నింగ్ బ్యాచ్ దేశవ్యాప్తంగా లక్షల్లో డబ్బు కాజేసినట్టు వెల్లడించారు. నల్గొండ […]

పోలీస్‌ల పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల మోసాల్లో షాకింగ్ నిజాలు. !
Follow us

|

Updated on: Oct 01, 2020 | 10:47 AM

తెలంగాణ పోలీస్‌ల ప్రొఫైల్స్‌తో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బుగుంజుతోన్న ముఠా ఆటకట్టించారు నల్గొండ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి 10 మంది పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ నుండి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుందని తెలిపారు. పోలీస్‌ల ప్రొఫైల్స్‌తో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, డబ్బు అవసరం ఉంది.. గూగుల్ పేలో మనీ పంపాలంటూ ఈ కన్నింగ్ బ్యాచ్ దేశవ్యాప్తంగా లక్షల్లో డబ్బు కాజేసినట్టు వెల్లడించారు. నల్గొండ ఎస్పి రంగనాథ్ పేరుతో మొదలైన ఫేక్ ప్రొఫైల్స్ మోసం.. తెలంగాణలోని ఏకంగా 100 మంది పోలీసుల ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ తో సైబర్ నేరాలకు ఈ ముఠా పాల్పడింది. వీరి నుండి భారీగా ఫోన్ సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక్కో నిందితుడి నుండి 100 కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోవడం విశేషం.

దేశవ్యాప్తంగా 230 మంది పోలీసుల ప్రొఫైల్స్ తో వీళ్లు మోసాలకు పాల్పడినట్టు నల్గొండ పోలీసులు వెల్లడించారు. అడిషనల్ డిజి నుండి కానిస్టేబుల్స్ వరకు ఫేక్ అకౌంట్స్ తో హడలెత్తించిన ముఠా సభ్యుల్లో మైనర్ లే ఎక్కువ కావడం ఆసక్తికర అంశం. వీరంతా కేవలం 8, 9 తరగతులు మాత్రమే చదువుకున్నవాళ్లు కావడం మరో విశేషం. తెలంగాణ, ఏపి, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడిశా రాష్ట్రంలోని పోలీస్ ప్రొఫైల్స్ ను వాడుకుని ఈ మైనర్లు మోసాలకి పాల్పడ్డారు. భరత్ పూర్ లో నిందితుల నుండి ప్రతిఘటన ఎదురు కాకుండా చాకచక్యంగా వ్యవహరించి.. కథ నడిపించి నిందితుల్ని అరెస్ట్ చేశారు నల్గొండ పోలీసులు.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!