Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

శర్వా లుక్ అదుర్స్.. టీజర్ టైమ్ ఫిక్స్!

Sharwanand's Ranarangam Teaser, శర్వా లుక్ అదుర్స్.. టీజర్ టైమ్ ఫిక్స్!

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమాలో శర్వా పూర్తి మాస్ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇటీవలే శర్వానంద్ గాయపడడంతో కొద్దిరోజులు షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే శర్వా త్వరగా కోలుకోవడంతో షూటింగ్ మళ్ళీ ప్రారంభమైనది. ఇది ఇలా ఉంటే ఈ చిత్ర టీజర్‌ను ఇవాళ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.

కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందిస్తుండగా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

మరోవైపు శర్వానంద్ ఈ సినిమాతో పాటు ’96’ తెలుగు రీమేక్‌లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా సమంతా నటిస్తోంది.

Related Tags