Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

కాంగ్రెస్ పార్టీ పచ్చి అవకాశవాది.. బీజేపీ మండిపాటు

shame on you shashi tharur slammed over tweet on us's jammu and kashmir, కాంగ్రెస్ పార్టీ పచ్చి అవకాశవాది.. బీజేపీ మండిపాటు

భారత అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసే ఏ అవకాశాన్నీ కాంగ్రెస్ పార్టీ వదులుకోదని బీజేపీ మండిపడింది. జమ్మూ కాశ్మీర్ లో కేంద్రం గతంలో విధించిన ఆంక్షలను ఖండిస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ఇద్దరు ఎంపీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ఈ తీర్మానం హర్షించదగినదని ఆయన వ్యాఖ్యానించారు. (ఇండియన్ అమెరికన్ డెమొక్రాట్ ప్రమీలా జయపాల్, రిపబ్లికన్ స్టీవ్ వాట్ కిన్స్ సంయుక్తంగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు). కాగా-శశిథరూర్ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ శోభా కరంద్ లాజే తీవ్రంగా దుయ్యబట్టారు. భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని ప్రశంసించడం మీకు సిగ్గుగా లేదూ అని ఆమె ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆంక్షలు విధించిన తరువాత మొదటిసారిగా ఆ రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకు తగ్గాయని, పైగా ప్రజలు కూడా తాము సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి భారత ప్రతిష్టను దిగజార్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదన్నారు. దక్షిణ బెంగుళూరుకు చెందిన ఎంపీ తేజస్వి సూర్య కూడా థరూర్ ను విమర్శించారు.

కాశ్మీర్లో ఇంకా పలుచోట్ల ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు కొనసాగుతున్నాయని, వాటిని ఎత్తివేయాలని ప్రమీలా జయపాల్, స్టీవ్ వాట్ కిన్స్ తమ తీర్మానంలో కోరారు. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల పరిశీలకులను ఆ రాష్ట్రంలోనికి అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. పైగా ఆంక్షల నేపథ్యంలో కాశ్మీర్ ప్రజలు స్వేఛ్చగా తిరగలేకపోతున్నారని వారు పేర్కొన్నారు.

Related Tags