కబీర్ సింగ్.. కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు

అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్‌లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్ బాలీవుడ్‌లో హంగామా చేస్తోంది. విడుద‌లైన రోజు విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం అద్భుతాలు చేస్తోంది ఈ బోల్డ్ అండ్ సోల్‌పుల్ మూవీ. ఈ సినిమా తెలుగులో విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఇప్పుడు హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఒరిజిన‌ల్ తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడే […]

కబీర్ సింగ్.. కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు
Follow us

|

Updated on: Jun 24, 2019 | 10:10 PM

అర్జున్ రెడ్డి మూవీ టాలీవుడ్‌లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన కబీర్ సింగ్ బాలీవుడ్‌లో హంగామా చేస్తోంది. విడుద‌లైన రోజు విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం అద్భుతాలు చేస్తోంది ఈ బోల్డ్ అండ్ సోల్‌పుల్ మూవీ. ఈ సినిమా తెలుగులో విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా ఇప్ప‌టికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. ఇప్పుడు హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఒరిజిన‌ల్ తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడే కావ‌డంతో ఎక్క‌డా గాడి త‌ప్ప‌కుండా క‌బీర్ సింగ్‌ను రీమేక్ చేసాడు. ఇప్పుడు అక్క‌డ కూడా క‌బీర్ సింగ్ మేనియా న‌డుస్తుంది.

సినిమాకు ఎబోవ్ యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం అదిరిపోతున్నాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 71 కోట్లు వ‌సూలు చేసింది. అది కూడా ఇండియా ఒక్క‌టే.. ఓవ‌ర్సీస్ కూడా క‌లుపుకుంటే లెక్క 90 కోట్ల‌కు పైగానే ఉంది. ఈ ఏడాది భార‌త్ సినిమా త‌ర్వాత అత్య‌ధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా ఇదే కావ‌డం విశేషం. షాహిద్ క‌పూర్ సినిమాల‌కు కొన్నేళ్లుగా క‌నీసం 10 కోట్ల ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. కానీ క‌బీర్ సింగ్ మాత్రం ఏకంగా 20 కోట్ల‌కు పైగా తీసుకొచ్చింది. ఇక రెండో రోజు కూడా 22 కోట్లు.. మూడో రోజు ఏకంగా 28 కోట్లు తీసుకొచ్చాడు. మొత్తానికి క‌బీర్ సింగ్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ర‌చ్చ చేస్తున్నాడు.