ఉగ్రవాదులకు మద్దతుగా భారీ ర్యాలీ

Separatists rally in Jammu and Kashmir in support of Terrorism, ఉగ్రవాదులకు మద్దతుగా భారీ ర్యాలీ

ముస్లింల పవిత్ర రంజాన్ రోజు.. జమ్ముకశ్మీర్‌లో అల్లరిమూకలు చెలరేగాయి. శ్రీనగర్‌లో ఉగ్రవాదులకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. జామా మసీదులో ప్రత్యేక ప్రార్ధనల అనంతరం అల్లర్లు చెలరేగాయి. ఉగ్రవాది జకీర్‌ ముసా, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ అజార్‌కు మద్దతుగా పోస్టర్లు పట్టుకుని ఈ చర్యలకు పాల్పడ్డారు. అంతేకాదు ఐసీస్, అల్‌ఖైదా, జైషే మహ్మద్, లష్కర్‌ ఏ తోయిబా కు మద్దతుగా  బ్యానర్లు ప్రదర్శించారు.  పోలీసులపైకి అల్లరిమూకలు రాళ్లతో ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడుతూ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి అల్లరిమూకలు. అయితే పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి.. లాఠీఛార్జ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *