సొంత పార్టీ పెడతా.. సినిమాల్లోనూ నటిస్తా – ప్రకాష్ రాజ్

Actor Prakash Raj, సొంత పార్టీ పెడతా.. సినిమాల్లోనూ నటిస్తా – ప్రకాష్ రాజ్

సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బెంగళూరు ప్రజల కోసం తన గొంతు వినిపిస్తానని.. ఈ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా నిలబడడంతో తనకు.. ప్రజలకు మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ త్వరలోనే తాను సొంతంగా పార్టీ పెడతానని.. బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలో దింపుతానని ప్రకటించారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ పెట్టినా కూడా సినిమాల్లో నటించడం మాత్రం మాననంటూ స్పష్టం చేశారు.

కాగా రాజకీయ పార్టీని నడిపేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి.. అందుకోసమే తాను సినిమాల్లో నటిస్తానని చెప్పినట్లు ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన కొద్దిరోజులకే సొంతంగా పార్టీ పెడతానని ప్రకాష్ రాజ్ చెప్పడం ఇప్పుడు కన్నడ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *