రెండోసారి కరోనా సోకే అవకాశాలు ఎంతంటే

ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొనసాగుతుండగా.. కోలుకున్న వారికి మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం ఇప్పుడు ఆందోళనను కలిగిస్తోంది

రెండోసారి కరోనా సోకే అవకాశాలు ఎంతంటే
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 8:37 AM

Coronavirus re-infection news: ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరు కొనసాగుతుండగా.. కోలుకున్న వారికి మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం ఇప్పుడు ఆందోళనను కలిగిస్తోంది. ఈ కేసులు ఇప్పుడు పలు దేశాల్లో నమోదవుతున్నాయి. దీంతో కరోనా మళ్లీ మళ్లీ వస్తుందా..? మళ్లీ సోకితే కోలుకోవడం కష్టమా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా రెండోసారి సోకే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఖతార్ దేశ విభాగం స్పందించింది. దీనిపై ఖతార్ ప్రజారోగ్య శాఖ, ఖతార్ కార్నెల్‌ యూనివర్సిటీతో కలిసి పరిశోధన చేసిన డబ్ల్యూహెచ్‌ఓ.. రెండోసారి కరోనా వచ్చే అవకాశాలు 0.04శాతం మాత్రమేనని వెల్లడించింది. ప్రతి 10వేల మందిలో నలుగురికి మాత్రమే కరోనా మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని వివరించింది.

అధ్యయనంలో భాగంగా కరోనా సోకి కోలుకున్న 1,33,266 మందిపై పరిశోధన చేశారు. 45 రోజుల తరువాత వారికి ఆర్‌టీ–పీసీఆర్‌ చేశాక, అందులో 54 మందికి తిరిగి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధ్యయనంలో తేలింది. వారిలో 41 శాతం మందికి మాత్రమే కొద్దిపాటి లక్షణాలున్నాయని.. మరో 58 శాతం మందికి ఏ లక్షణాలు లేవని వివరించింది. ఒక శాతం మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. అయితే దీనిపై తదుపరి పరిశోధనలు కొనసాగుతున్నాయని, వైరస్ మరోసారి రావడానికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించవచ్చని తెలిపింది.

Read More:

నూతన్ నాయుడిని అందుకే అరెస్ట్ చేయలేదా…!

ఆ ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వండి: కేంద్రం

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి