స్కూల్స్ వర్కింగ్ డేస్ అనుగుణంగా సిలబస్..!

విద్యార్థులు ఈ ఏడాది వెనకుబడకుండా ఉండేందుకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో సిలబస్ తగ్గించేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే అనధికారికంగా సిలబస్ కుదింపుపై కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

స్కూల్స్ వర్కింగ్ డేస్ అనుగుణంగా సిలబస్..!
Follow us

|

Updated on: Jul 06, 2020 | 8:11 PM

కరోనా వైరస్ పుణ్యమాని విద్యా సంవత్సమే ఆగమైంది. జూన్ నెలలో మొదలు కావల్సిన పాఠాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. కొత్త పుస్తకాలు, కొత్త క్లాసులతో విద్యార్థుల హడావిడితో సందడిగా ఉండే పాఠశాలలు నిర్జనంగా మారాయి. దీంతో పాఠశాలల పనిదినాలు క్రమంగా తగ్గుతున్నాయి.

విద్యార్థులు ఈ ఏడాది వెనకుబడకుండా ఉండేందుకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో సిలబస్ తగ్గించేందుకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే అనధికారికంగా సిలబస్ కుదింపుపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే జాతీయ స్థాయిలోని సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ సిలబస్ ను 25 శాతం నుంచి 30 శాతం తగ్గించనున్నట్టు ప్రకటించాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కూడా తగ్గింది. దీంతో సిలబస్ తగ్గించుకోవచ్చని అయా రాష్ట్రాలకు సూచించింది. దీంతో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అలర్ట్ అయింది. ఏఏ సబ్జెక్టులో ఎంతెంత సిలబస్ తగ్గించవచ్చనే అంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. వర్కింగ్ డేస్ కు అనుగుణంగా సిలబస్ ను తగ్గించాలని భావిస్తోంది. అయితే, సిలబస్ తగ్గింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్తున్నారు.

రాష్ర్టంలో ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు సుమారు 58 లక్షల మందికి పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. అన్ని తరగతులకు ప్రభుత్వం, విద్యాశాఖ సూచనలతో ఎస్సీఈఆర్టీనే సిలబస్ ను రూపొందిస్తుంది. సబ్జెక్టు ఎక్స్ పర్స్ట్, సీనియర్ టీచర్లతో కమిటీ ఏర్పాటు చేసి సబ్జెక్ట్ కుదింపుపై అధ్యయనం చేయాలని అధికారులు సూచించినట్లు సమాచారం. ప్రతి సబ్జెక్టులో 30 శాతం వరకు కోత పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తసుతం ప్రభుత్వ ఆదేశాలు లేనప్పటికీ ఉన్నతాధికారుల చొరవతోనే సిలబస్ కుదింపుపై కుస్తీ పడుతున్నారు.

మరోవైపు ఏపీలోనూ 30 శాతం సిలబస్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వారు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారనేదీ తెలంగాణ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ర్టంలోని టెక్స్ట్ బుక్స్ ప్రింట్ ఇప్పటికీ సిద్దమయ్యాయి. అయినప్పటికీ బోధించిన సబ్జెక్ట్ కు అనుగుణంగా ప్రశ్నపత్రాలను రూపొందించే అవకాశాన్ని అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు