మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ..

ఎస్‌బీఐ మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. కరోనాతో ముంచుకొచ్చిన ఆర్థిక విధ్వంసంతో పెద్ద పెద్ద సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే రానున్న పండగ సీజన్‌లో డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలపై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎస్‌బీఐ..
Follow us

|

Updated on: Sep 28, 2020 | 8:11 PM

State Bank of India : ఎస్‌బీఐ మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. కరోనాతో ముంచుకొచ్చిన ఆర్థిక విధ్వంసంతో పెద్ద పెద్ద సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే రానున్న పండగ సీజన్‌లో డిమాండ్‌ను పునరుద్ధరించేందుకు పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలపై భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యోనో యాప్‌లో ఆటోమొబైల్‌, గోల్డ్‌, వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసే కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఆమోదం లభించిన ప్రాజెక్టుల్లో గృహాలను కొనుగోలు చేసేవారి గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజునూ  వంద శాతం మాఫీ చేయనున్నట్టు ఎస్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఎంపిక చేసిన కస్టమర్లకు వడ్డీ రేట్లలో 10 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ కల్పించనుంది.

ఇక ఎస్‌బీఐ(SBI YONO) యోనోపై గృహ రుణానికి దరఖాస్తు చేసుకున్నవారికి అదనంగా వడ్డీరేటుపై మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీని ఇస్తున్నట్లుగా ప్రకటించింది. గోల్డ్‌ లోన్‌లకు దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు 7.5 శాతం వడ్డీ రేటుతో 36 నెలల్లోగా తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తోంది. ఇక వ్యక్తిగత రుణాలపై 9.6 శాతం నుంచి వడ్డీ వసూలు చేయనున్నట్టు బ్యాంకు  పేర్కొంది. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసే కారు, గృహ రుణాల దరఖాస్తులకు సూత్రప్రాయ ఆమోదం తెలుపుతామని పేర్కొంది. ప్రస్తుత ఎస్‌బీఐ కస్టమర్లు యోనో యాప్‌పై వ్యక్తిగత రుణానికి ఆమోదం పొందవచ్చని వెల్లడించింది.