మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్.. ముందుగా వారికే ప్రాధాన్యత..!

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మాయదారి రోగాన్ని తరిమికొట్టేందుకు అయుధం బయటకు వచ్చింది. ఆది నుంచి కరోనా టీకాను తామే ముందు తీసుకువస్తామన్న మాటను రష్యా నిలబెట్టుకుంది.

మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్.. ముందుగా వారికే ప్రాధాన్యత..!
Follow us

|

Updated on: Sep 25, 2020 | 5:03 PM

ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మాయదారి రోగాన్ని తరిమికొట్టేందుకు అయుధం బయటకు వచ్చింది. ఆది నుంచి కరోనా టీకాను తామే ముందు తీసుకువస్తామన్న మాటను రష్యా నిలబెట్టుకుంది. రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వీ’ టీకాను అక్కడ వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను‌ గమలేయా ఫెడరల్‌ రీసెర్చి సెంటర్‌ తయారు చేసిన విషయం తెలిసిందే. ‘‘రష్యాలోని అన్ని ప్రదేశాలకు స్పుత్నిక్‌-వి టీకాను చేరవేశాం. ప్రజలు ఈ టీకాలను తీసుకొంటున్నారు’’ అని రష్యా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కడి ఫెడరల్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రకారం 27,000 డోసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. వీటిని ముందుగా ఆరోగ్య సిబ్బందికి ఇచ్చేందుకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.

రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఆగస్టు 11న ప్రకటించడం ఆసక్తిగా మారింది. దీంతో వ్యాక్సిన్‌ కోసం రష్యా వైపు పలుదేశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే దాదాపు 20 దేశాలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు వ్యాక్సిన్‌ తయారు చేసిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ ‌ఈ మధ్యే వెల్లడించింది. ఇప్పటివరకు 100 కోట్ల డోసుల కోసం అర్డర్లు వచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది. ఇందులో భాగంగా 2020 చివరి నాటికే 20 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. వీటిలో 3 కోట్ల డోసులను రష్యాలో తయారు చేస్తుండగా.. మిగతా వాటిని దక్షిణ కొరియా, బ్రెజిల్‌, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబాతో పాటు భారత్‌ భాగస్వామ్యంతో చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.